HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన చిత్రాలలో హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా ఒకటి. ఈ సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. జూన్ 12వ తేదీ ఈ సినిమా విడుదల పక్కా అని నిర్మాతలు ప్రకటించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన హీరోను చాలా సంవత్సరాల తర్వాత వెండితెరపై చూడబోతున్నామనే ఆనందం వారికి ఎక్కువ రోజులు కూడా లేకుండా పోయింది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఎడిటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది.
విడుదలకు మరింత ఆలస్యం…
ఇక ఈ సినిమా జూన్ 12వ తేదీ వాయిదా పడటంతో తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాలు వెల్లడించలేదు. ఇక ఈ సినిమా 12న విడుదల అవుతుందన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత ఏ.యం రత్నం (A.M Ratnam)వరుస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను బయటపెట్టారు. అయితే తాజాగా వీరమల్లు సినిమాకు సంబంధించి మరొక సంచలన విషయం బయటకు వచ్చింది.
కథలో మార్పులు…
హరిహర వీరమల్లు సినిమాకు ముందుగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlanudi)అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఒక గొప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే అందుకు కారణం క్రిష్ అని చెప్పాలి. ఈ సినిమా కథ మొఘల్ సామ్రాజ్యం నాటిదని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా చాలా విభిన్న పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా చాలా కాలం పాటు వాయిదా పడుతూ వస్తుంది. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో డైరెక్టర్ క్రిష్ తనకున్నటువంటి కమిట్మెంట్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా క్రిష్ మధ్యలో ఈ సినిమా నుంచి తప్పుకోవటంతో ఈ సినిమాకు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సినిమా జ్యోతి కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక క్రిష్ తప్పకున్న తర్వాత జ్యోతి కృష్ణ ఈ సినిమాలో భాగం కావడంతో ఈయన సినిమా కథ మొత్తం మార్చారని తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేసి షూటింగ్ పూర్తి చేశామని సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ చిత్రాన్ని క్రిష్ గారికి చూపిస్తే ఆయన కచ్చితంగా షాక్ అవుతారని ఏం రత్నం తెలిపారు. ఆయన చెప్పిన కథకు మేము చేసిన సినిమాకు కొంత మార్పు ఉంటుందని ఈ సందర్భంగా నిర్మాత రత్నం గారు వీరమల్లు సినిమా కథ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.