BigTV English
Advertisement

Allu Arjun: ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. బన్నీని ఏకేస్తున్న నెటిజన్స్..మారవా అంటూ ట్రోల్స్!

Allu Arjun: ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. బన్నీని ఏకేస్తున్న నెటిజన్స్..మారవా అంటూ ట్రోల్స్!

Allu Arjun: సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ చేసినా కూడా అది లక్షల మంది చూస్తారు. ముఖ్యంగా ఒక పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు పెట్టే చిన్నదైనా సరే చాలా వైరల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా బన్నీ చేసిన ఓ పోస్ట్ పై సోషల్ మీడియాలో నెగటివిటీ ఏర్పడింది. అల్లు అర్జున్ ఇక నువ్వు మారవా అంటూ ఆయన చేసిన తాజా పోస్ట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి అల్లు అర్జున్ చేసిన తప్పేంటి..? ఆయన్ని ఎందుకు నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో తన రేంజ్ ను మార్చుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పాపులరిటీని సంపాదించుకున్న అల్లు అర్జున్.. పుష్ప-2 సినిమా విడుదయ్యి, సంధ్య థియేటర్లో తొక్కేసలాట జరగడంతో చాలా వివాదాలకు గురవుతున్నాడు.


వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.. మళ్లీ ఇరుక్కుపోయిన బన్నీ..

పైగా ఈయన ఏది చేసినా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ పెట్టిన ఓ చిన్న పోస్ట్ పై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత మోగుతోంది. మరి ఇంతకీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే.. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి పోస్టులు చేశారు.ఇందులో భాగంగా అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనే పోస్టర్ ని పోస్ట్ చేశారు. అయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని పోస్ట్ పెడితే ఇందులో తప్పేముందని మీరందరూ అనుకోవచ్చు. అయితే పెట్టడంలో తప్పులేదు.కానీ ఆ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనే పోస్ట్ కింద కూడా AA అల్లు అర్జున్ అనే పేరు పెట్టడమే సోషల్ మీడియాలోని మీమర్స్ కి పెద్ద స్టఫ్ దొరికినట్టు అయింది.అయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఎక్కడకి వెళ్లినా బ్రాండ్ బ్రాండ్ అంటూ చెప్పుకొని తిరుగుతున్నారు.


బన్నీపై రెచ్చిపోతున్న మీమర్స్..

దీంతో చాలామంది నెటిజన్లు పర్యావరణ దినోత్సవం గురించి పోస్ట్ చేసిన కూడా దాని కింద నీ పేరు ఉండాల్సిందేనా.. ఎక్కడ చూసినా AA అని ఉండాల్సిందేనా.. తొక్కలో బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే పడని కొంతమంది నెటిజన్స్ హద్దులు మీరి కామెంట్లు పెడుతున్నారు.ఈయన పెట్టిన పోస్టుపై మీమ్స్ క్రియేట్ చేస్తూ మీమర్స్ రెచ్చిపోతున్నారు. నువ్వు ఇక మారవా.. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనా అంటూ వైరల్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వైరల్ గా మారడంతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు అల్లు అర్జున్. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ బ్రాండ్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని, బ్రాండ్ ని పక్కన పెట్టడం మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:Paadutha Theeyaga Promo : సింగర్ సునీత మిస్సింగ్… జడ్జ్ రిప్లేస్ కారణం అదేనా ?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×