Andala Rakshasi Re Release: మెగా కోడలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. ఇక ఈమె “అందాల రాక్షసి”(Andala Rakshasi) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో మిధున పాత్రలో లావణ్య త్రిపాఠి నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తదుపరి ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
నంది పురస్కారం…
హను రాఘవపూడి దర్శకత్వంలో, లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర , రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఒక అందమైన ప్రేమకథాచిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్. ఎస్. రాజమౌళి వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 2012 ఆగస్టు 10 న విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా, 2012 నంది పురస్కారాలలో భాగంగా ఈ సినిమాకు ఉత్తమ కళ దర్శకుడి విభాగంలో నంది పురస్కారాన్ని (Nandi Award) కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇలా అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
అద్భుతమైన ప్రేమకథా చిత్రం…
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు తిరిగి వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అందాల రాక్షసి సినిమా కూడా జూన్ 13వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. మరోసారి ఈ అద్భుతమైన ప్రేమ కథ చిత్రాన్ని వెండితెరపై చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే జూన్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. జూన్ ఆరో తేదీ విష్ణు ఢీ సినిమా రీ రిలీజ్ అవుతుండగా, 13వ తేదీ అందాల రాక్షసి సినిమా తిరిగి విడుదల కాబోతోంది. ఇక ఇదే నెలలో కుబేర, కన్నప్ప వంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే జూన్ 12వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా ఎడిటింగ్ ఇతర పనులు పూర్తికాని నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. ఇలా మామయ్య సినిమా విడుదల వాయిదా పడటంతో ఇదే అదునుగా భావించిన కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక లావణ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఈమె త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి కూడా తెలిసిందే.