E-Paper
Advertisement

Jai Hanuman: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జై హనుమాన్’ కొత్త పోస్టర్..

Jai Hanuman: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జై హనుమాన్’ కొత్త పోస్టర్..
Advertisement

Jai Hanuman: టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

ముఖ్యంగా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. అంతేకాకుండా దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ కూడా మరింత గ్రాండ్ లెవెల్లో ఉంది. ఈ కారణంగానే సినిమా బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌ను అందుకుంది. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా తన హవా చూపించింది.

 Hanuman
Hanuman
Advertisement

దాదాపు రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకుడు సీక్వెల్‌ను ప్రకటించాడు. ఈ చిత్రానికి గానూ టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ‘జై హనుమాన్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ సీక్వెల్ మూవీ ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: జై హనుమాన్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..

Advertisement

ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి అప్డేట్‌కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ను అందించారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో రాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘‘ శ్రీరాముడి దివ్య ఆశీర్వదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా వాగ్దానం. మునుపెన్నడూ లేని అనుభూతిని, జీవితకాలం జరుపుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తానని’’ రాసుకొచ్చాడు. దీనిబట్టి చూస్తే జై హనుమాన్ మూవీ మరింత గ్రాండ్ విజువల్స్‌తో అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×