Big Stories

Ambati Tea campaign: అంబటి మాస్టర్ ప్లాన్, ఆపై ఆదేశాలు..?

Ambati Tea campaign: అసలే ఎండాకాలం.. వైసీపీ నేతలు ఉక్కుపోతకు గురవుతున్నారు. ఫ్యాన్ గాలి ఓటర్లకు రీచ్ కాకపోవడంతో నానాఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా తమ బుర్రకు పదును పెడుతున్నారు నేతలు. దీనికితోడు ఎన్నికల సంఘం అన్నివైపుల నుంచి ఆంక్షలు పెట్టడంతో కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు. ఈ జాబితాలో మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు.

- Advertisement -

మంత్రి అంబటి రాంబాబు తన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో ఆ మధ్య బుల్లెట్‌పై తిరుగుతూ ప్రజలను పలకరించేవారు. ఆ తర్వాత కేఫ్ దుకాణానికి వెళ్లి కస్టమర్లకు టీ చేసి ఇచ్చారు కూడా. దాదాపు వారం రోజులపాటు ఇలాగే సాగింది. మంత్రి అంబటి మావద్దకే వస్తున్నారని అక్కడి ప్రజలు అనుకున్నారు. కానీ రాంబాబు మాస్టర్ ప్లాన్ వేరేగా ఉందని ఆ తర్వాత అక్కడి ప్రజలకు అర్థమైంది. రోజూ టీ షాపుకు ఎంతమంది కస్టమర్లు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు అంబటి.

- Advertisement -
Ambati Tea campaign
Ambati Tea campaign

ఇంకేముంది.. ఆ తర్వాత టీ షాపులకు వెళ్లడం మానేశారు మంత్రి అంబటి. ఏంటా అని కొందరు వ్యక్తులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. పేపర్ టీ కప్పులపై పార్టీ పేరు, ఆయన ఫోటోలతో వైసీపీకే ఓటు వేసి తమను గెలిపించాలని రాసి ఉంది. 500 నుంచి 1000 కప్పుల వరకు పంపిణీ చేసి ప్రచారం చేపట్టాలని టీ షాపు ఓనర్లను ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. మంత్రి చెబితే కాదంటారా? అలాగే కానిచ్చారు. కప్పులను టీ షాపు యాజమానులు రెడీ చేశారు. పంచిబెట్టడానికి సిద్ధమైన సమయంలో మీడియా కంటపడింది. సోషల్‌మీడియా అంబటి టీకప్పులు ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News