Telugu Star Hero: ఇటీవల ఒక టాప్ పాన్ ఇండియా స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ఎక్కువగా వినిపిస్తోంది. అయిదేళ్లు కష్టపడి చేసిన ఒక సినిమా రిజల్ట్ తో పాన్ ఇండియా హీరో అయిపోయిన ఆ స్టార్, వరసగా రెండు సాలిడ్ హిట్స్ కొట్టి తన మార్కెట్ రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లూప్ లైన్ లో పెట్టిన ఆ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఇండియా వైడ్ పండగ వాతావరణం ఉంటుంది. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడని టాక్.
మద్యం తాగే అలవాటు ముందు నుంచీ ఉన్నా కూడా ఈ మధ్య మరీ ఎక్కువ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అలవాటు కారణంగానే ఆ స్టార్ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించగానే “ముందు లాగే ఎనర్జీ కనిపించడంలేదు,” “ఫ్రెష్‌నెస్ పోయింది,” అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఆ హీరో ఫోటోస్ ని ట్రోల్ చేస్తూ, హీరో లుక్స్ గురించి విమర్శలు చేస్తున్నారు. తాగుడు అలవాటే ఆ హీరోని ఈ పరిస్థితి తెచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయట.
సినిమా షూటింగ్ లేని సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడంలో తప్పు లేదు కానీ షూటింగ్స్ ఉన్నా కూడా సెట్స్ కి వెళ్లకుండా తాగడం అనేది అతని కెరీర్ కే ప్రమాదం కలిగించే విషయం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, అతను ఇటీవల షూటింగ్స్‌కు హాజరు కావడం తగ్గించేశాడు. దాంతో, ఆయన నటిస్తున్న సినిమాలు ఊహించని విధంగా ఆలస్యం అవుతున్నాయి.
ఇది ఒక్క సినిమాకి సంబంధించిన విషయం కాదు, వరుసగా రెండు మూడు చిత్రాలు కూడా నిరవధికంగా లేటవుతుండటంతో ప్రొడ్యూసర్లు టెన్షన్‌కి గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ స్టార్ హీరో తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం అలవాటు వదిలేస్తే మంచిది. ఎందుకంటే, ఎంత పెద్ద స్టార్‌డమ్ ఉన్నా, ఆరోగ్యమే లేకుంటే, అద్భుతమైన అవకాశాలూ, భారీ సినిమాలూ వృథా అవుతాయి. ఒకసారి కెరీర్ డౌన్ అవ్వగానే మళ్లీ అదే రేంజ్‌కు రావడం చాలా కష్టం. అందుకే అభిమానులు కూడా ఈ హీరో త్వరగా తన లైఫ్ స్టైల్ లో మార్పు తీసుకురావాలని, ఒకప్పటి లుక్ లోకి రావాలని కోరుకుంటున్నారు!
ఆ హీరో అనే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం… ఇక్కడ జాగ్రత్తగా లేకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి గతంలో కూడా సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద హీరోలు మద్యం అలవాటు వల్ల తమ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేసుకున్నారు.