BigTV English
Advertisement

Allu Arjun: అట్లీ-అల్లు అర్జున్ అరాచకం.. పుష్పని మించి ఆ సీన్.. చొక్కాలు చింపేసుకోవడం ఖాయం..

Allu Arjun: అట్లీ-అల్లు అర్జున్ అరాచకం.. పుష్పని మించి ఆ సీన్.. చొక్కాలు చింపేసుకోవడం ఖాయం..

Allu Arjun: టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకునే మూవీ ఏదైనా వుందంటే అది అల్లుఅర్జున్- అట్లీ మూవీ. అల్లు అర్జున్ 22వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. అట్లీ కి 6వ సినిమా, సన్ పిక్చర్స్ నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానుంది. సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలువనుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీలో మరో అప్డేట్ ను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం..


అట్లీ, అల్లు అర్జున్ అరాచకం..

పుష్ప సినిమాతో భారీ పాపులర్ కి సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏకంగా ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం 120 కోట్లు కేటాయిస్తున్నట్లు టాక్. అయితే తాజాగా ఈ మూవీలో ఓ భారీ యాక్షన్స్ సీక్వెల్ ను డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. అండర్ వాటర్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఎన్నో మూవీలలో అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్స్ మనం చూసాం. ఇటీవల విడుదలైన దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అండర్ వాటర్ ఫైట్, ఓ రేంజ్ లో హిట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తున్న మూవీలో అండర్ వాటర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. అట్లీ- అల్లు అర్జున్ అరాచకాన్ని చూడడానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అండర్ వాటర్ సీన్ తో ఫాన్స్ చొక్కాలు చింపేసుకోవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.


ఈ మూవీ పై ఎన్నో అంచనాలు ..

ఇక అల్లు అర్జున్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ఒక్కో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న మధ్య అల్లు అర్జున్ మూవీ బడ్జెట్ ఆయన రెమ్యునేషన్ మూవీ లో వచ్చే లాభాల గురించి ఓ వార్త వైరల్ అయింది. ఆ తరువాత హీరోయిన్ గురించి ఎన్నో వార్తలు పుకార్లుగా పుట్టుకొచ్చాయి. ముందు ప్రియాంక చోప్రా, అని ఆ తరువాత సమంత అని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే సమంత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ తో నటించారు. మరోసారి ఈ హీరో తో రొమాన్స్ చేసేందుకు ఈ హీరోయిన్ ఓకే చెప్పినట్లు టాక్.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పుడు మరోసారి అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను ఆగస్టులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Single OTT: ఓటీటీకి సిద్ధమైన సింగిల్.. ఎప్పుడు.. ఎందులో అంటే.!?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×