E-Paper
Advertisement

AP : సీఐని తోసేసిన విడదల రజినీ.. రెచ్చిపోయిన పోలీసులు..

AP : సీఐని తోసేసిన విడదల రజినీ.. రెచ్చిపోయిన పోలీసులు..
Advertisement

AP : విడదల రజినీ ఉగ్రరూపం. మాస్ మహారాణి పూనకం. నడి రోడ్డు మీద రెచ్చిపోయారు మాజీ మంత్రి. పోలీసులపై విరుచుకుపడ్డారు. తన అనుచరుడు శ్రీకాంత్‌ను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. సీఐని నెట్టి వేశారు. పోలీసులతో గొడవ పడ్డారు. నడిరోడ్డు మీద నానా రచ్చ చేశారు.

మాజీ మంత్రి అయితేనేం? పోలీసులు ఊరుకుంటారా? ఖాకీలు సైతం అదే రేంజ్‌లో రెచ్చిపోయారు. రజినీతో గొడవకు దిగారు. బలవంతంగా ఆమె కారులోకి ప్రవేశించారు. అప్పటి వరకూ కారులో నక్కిన శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వర్సెస్ విడదల రజినీ ఎపిసోడ్‌తో పల్నాడు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది.

Advertisement

అసలేం జరిగిందంటే..

నాదెండ్ల మండలం మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు మాజీ మంత్రి విడదల రజినీ. ఆమెతో పాటు కారులో ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఆ విషయం తెలిసి ఓ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, అందుకు విడదల రజినీ ఒప్పుకోలేదు. కారులో ఉన్న శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మాగ్జిమమ్ ట్రై చేశారు. ఈ క్రమంలో కారు డోరును నెడుతూ.. సీఐ మీదకు దూసుకొచ్చారు రజినీ. ఆ క్రమంలో సీఐ సుబ్బారాయుడిని దూరంగా తోసేశారు మాజీ మంత్రి. ఏ కేసులో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుంటారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

సీఐ వర్సెస్ రజినీ

పోలీసులు సైతం ఎక్కడా తగ్గలేదు. తమ విధులకు అడ్డు రావొద్దంటూ రజినీకి సూచించారు. అయినా ఆమె వినకపోతే ఖాకీలు దూకుడు పెంచారు. విడదల రజినీని పక్కకు జరిపేసి.. కారు డోర్ తీసుకుని.. వేగంగా లోపలికి దూసుకెళ్లారు సీఐ సుబ్బారాయుడు. అసలు ఏం జరుగుతోందో అర్థం అయ్యేలోగానే.. సీఐ స్పీడ్‌గా తన పని ముగించేశారు. శ్రీకాంత్‌ను బలవంతంగా కారులోంచి బయటకు దింపేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో పోలీసులు, విడదల రజినీ మధ్య తీవ్ర గలాటా జరిగింది. మహిళా నాయకురాలిపై ఖాకీలు దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ వర్గాలు ఆ వీడియోను షేర్ చేస్తున్నాయి. పోలీసులపై విడదల రజినీ దౌర్జన్యం చేశారంటూ టీడీపీ శ్రేణులు సైతం అదే వీడియోను వైరల్ చేస్తున్నాయి.

Also Read : ఈ టైమ్‌లో ఇది అవసరమా? యుద్ధంతో రాజకీయమా?

చిక్కుల్లో మాజీ మంత్రి..

అధికారం కోల్పోయాక విడదల రజినీని కేసులు చుట్టుముడుతున్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులకు బెదిరించి రూ. 2 కోట్లు డబ్బులు వసూలు చేశారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో A1 గా ఉన్న రజినీ ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. A3 గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. A4గా రజినీ పీఏ రామకృష్ణ ఉన్నారు. క్రషర్ కేసులో మాజీ మంత్రి విడదల రజినీ నేడో రేపో అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తన అనుచరుడు శ్రీకాంత్ కోసం పోలీసులతో రజినీ గొడవ పడటం, ఆ వీడియో కాస్త వైరల్ అవుతుండటంతో.. ఆమెపై మరో కేసు కన్ఫామ్ అంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×