BigTV English
Advertisement

Aamir Khan: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో అమీర్ ఖాన్ చక్కర్లు.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన మాజీ భార్య

Aamir Khan: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో అమీర్ ఖాన్ చక్కర్లు.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన మాజీ భార్య

Aamir Khan: సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారితో విడిపోయి మరొకరితో ప్రేమలో పడడం అనేది చాలా కామన్. అయితే విడాకులు తీసుకున్న జంటలు కూడా ఫ్రెండ్స్‌గా ఉండిపోదామనే అనే అగ్రిమెంట్‌పైనే విడిపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఫ్రెండ్స్‌గా ఉన్న జంటలు ఎన్నో ఉన్నాయి. అందులో అమీర్ ఖాన్ కూడా ఒకడు. ఇప్పటికే అమీర్ ఖాన్‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆ ఇద్దరితో చాలాకాలం వైవాహిక జీవితం గడిపిన తర్వాతే విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరితో సన్నిహితంగా ఉంటూ కొత్తగా మరొక అమ్మాయితో డేటింగ్ మొదలుపెట్టాడు అమీర్. ఇదే సమయంలో తన మాజీ భార్య చేసిన పోస్ట్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.


ఒకరికొకరు సపోర్ట్‌గా

అమీర్ ఖాన్.. తన మొదటి భార్యతో అంత సన్నిహితంగా ఉండకపోయినా తన కూతురికి మాత్రం మంచి తండ్రిగా ఉంటాడు. తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడు. ఇక ఇటీవల రెండో భార్య కిరణ్ రావుతో కూడా విడాకులు తీసుకొని విడిపోయాడు ఈ బాలీవుడ్ సీనియర్ హీరో. విడాకులు అయిపోయిన తర్వాత కూడా ఈ ఇద్దరూ ఒకరినొకరు పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా సపోర్ట్ చేసుకోవడం మాత్రం ఆపలేదు. ఇటీవల కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ అనే సినిమాను తన సొంత ప్రొడక్షన్ హౌస్‌తో స్వయంగా నిర్మించాడు అమీర్ ఖాన్. ఇదంతా పక్కన పెట్టి తాజాగా తన పుట్టినరోజు వేడుకల్లో తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ అయిన గౌరీ స్ప్రాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు.


పాత ఫోటోలు బయటికి

ఇటీవల అమీర్ ఖాన్.. మీడియాతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. అందులోనే తను ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ అనే బెంగుళూరు అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నానని ప్రకటించాడు. తనది బెంగుళూరు కావడంతో అమీర్ డేటింగ్ విషయం ఇన్నాళ్లు బయటికి రాలేదు. అలా ప్రకటించాడో లేదో.. ఇలా వెంటనే అమీర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యింది. ఇంతలోనే తన మాజీ భార్య కిరణ్ రావు.. అమీర్ ఖాన్‌తో, తన కుమారుడు ఆజాద్‌తో కలిసి దిగిన పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 16 ఏళ్ల వైవాహిక జీవితం అని చెప్తూ ఈ ఫోటోలను అప్లోడ్ చేసింది కిరణ్ రావు. ఇది చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

Also Read: అదెల గురూ.. ఇద్దరు మాజీ భార్యల ముందు కొత్త లవర్‌తో ఎంజాయ్ చేస్తున్నావ్.?

ఎప్పటికీ ప్రేమిస్తుంటాం

‘మా జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే. నువ్వు ఇచ్చిన హగ్స్‌కు, నవ్వులకు, ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నందుకు థాంక్యూ. మేము నిన్ను ప్రేమిస్తుంటాం’ అంటూ అమీర్ ఖాన్ (Aamir Khan) పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది కిరణ్ రావు (Kiran Rao). మామూలుగా ఏ మాజీ భార్య అయినా కూడా ఇంత జరిగిన తర్వాత కనీసం తన మాజీ భర్త గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడదు. కానీ కిరణ్ రావు మాత్రం చాలా కూల్‌గా తమ 16 ఏళ్ల వైవాహిక జీవితంలోని స్పెషల్ ఫోటోలు అన్నీ షేర్ చేసి అమీర్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. కిరణ్ రావు చేసిన ఈ పని చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×