BigTV English

Sunita Williams: అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ కు చెల్లించేది ఇంతేనా? దారుణం!

Sunita Williams: అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ కు చెల్లించేది ఇంతేనా? దారుణం!

Sunita Williams Salary: అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి హ్యోమగామి సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో రెండు రోజుల్లో భూమ్మీదకు రాబోతున్నారు. వారిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే స్పేస్ ఎక్స్ సంస్థ పంపించిన ‘క్రూ–10’ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం అయ్యింది. ఆ హ్యోమనౌకలో వెళ్లిన నలుగురు హ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సునీతా, విల్మోర్ మార్చి 19న భూమ్మీద అడుగు పెట్టనున్నారు. కేవలం 8 రోజుల పరిశోధన కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఈ ఇద్దరు హ్యోమగాములు, కిందికి తీసుకు రావాల్సిన స్పేస్ షిప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. సుమారు 9 నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.  ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల అంతరిక్ష యాత్రకు గాను సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ ఎంత శాలరీ ఇస్తారు? స్పేస్ టూర్ కు ఏమైనా ప్రత్యేకంగా పే చేస్తారా? ఇంతకీ అసలు వ్యోమగాములకు శాలరీ ఎంత ఉంటుంది? అనే విషయాల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఇంతకీ హ్యోమగాములకు శాలరీ ఎంత ఉంటుంది?

అమెరికా ప్రభుత్వంలో పని చేసే అత్యున్నత స్థాయి ఉద్యోగులకు  జనరల్‌ షెడ్యూల్‌(GS)-15 కేటగిరీ శాలరీ అందిస్తారు. ఈ కేటగిరీ కింద శాలరీ తీసుకునే వారికి ఏడాదికి 136,908 నుంచి  178,156 డాల‌ర్ల వ‌ర‌కు జీతం తీసుకుంటారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే  సునీత విలియ‌మ్స్‌, బుచ్ విల్మోర్‌ ఏడాదికి గాను.. 1,25,133 నుంచి 1,62,672 డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ.1.08 కోట్లు నుంచి రూ.1.41 కోట్ల వ‌ర‌కు శాలరీ తీసుకుంటారు.


సునీతకు దక్కేది రోజుకు కేవలం 4 డాలర్లే!

వాస్తవానికి ప‌రిశోధ‌న‌ల కోసం 9 నెల‌ల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు హ్యోమగాములకు నాసా 93,850 డాల‌ర్ల నుంచి 1,22,004 డాల‌ర్లు పే చేయాల్సి ఉంటుంది. భార‌త క‌రెన్సీలో రూ.81ల‌క్ష‌ల నుంచి రూ.1.05 కోట్లు ఉంటుంది. కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సునీతా విలియమ్స్ కు అంత చెల్లించదు. ఊహించని పరిణామాలు జరిగినప్పుడు కేవలం రోజుకు 4 డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ. 347 రూపాయలు మాత్రమే చెల్లిస్తారని నాసా మాజీ హ్యోమగామి క్యాడీ కోల్‌ మ‌న్ వెల్లడించారు. సునీతా విలియ‌మ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్‌లో 8 రోజులకు బ‌దులు 287 రోజులు గ‌డ‌పాల్సి వ‌చ్చింది. క్యాడీ కోల్ మన్ లెక్క ప్రకారం కేవ‌లం రూ1,148డాల‌ర్లు, అంటే భారత కరెన్సీలో కేవలం రూ. లక్ష అదనంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అస‌లు శాలరీతో పాటు ఆమెను అదనం కేవలం 1,148 డాల‌ర్లు అందుకోనుంది. ఈ మిషన్ లో భాగంగా ఇద్దరు హ్యోమగాములు మొత్తం శాలరీ 94,998 డాల‌ర్ల నుంచి 1, 23,152 డాల‌ర్ల వ‌ర‌కు, అంటే భారత కరెన్సీలోసుమారు రూ. 82 లక్షల నుంచి రూ. 1.06 కోట్లు పొందే అవకాశం ఉంటుంది.

గత ఏడాది జూన్ 5 అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత

సునీతా విలియమ్స్ గత ఏడాది జూన్ 5న అంతరిక్ష పరిశోధన కోసం వెళ్లింది. ఇప్పటికి సుమారు 285 రోజులు అయ్యింది. వాస్తవానికి 8 రోజుల తర్వాత అంటే  జూన్‌ 12న బయల్దేరి 15న భూమ్మీదకు రావాల్సి ఉంటుంది. వీరిని తీసుకెళ్లిన బోయింగ్‌ స్టార్‌ లైనర్‌ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాసా ఆ మరమ్మతులను భూమ్మీది నుంచి చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. సుమారు 9 నెలల తర్వాత వారిని తీసుకొచ్చేందుకు ఎలన్‌ మస్క్‌   స్పేస్‌ ఎక్స్‌ సంస్థ క్రూ–10  వ్యోమ నౌకను అంతరిక్షానికి పంపింది. ఇందులో నలుగురు హ్యోమగాములు అంతరిక్షకేంద్రానికి వెళ్లారు. మార్చి 19న సునీతా, బుచ్ విల్మోర్ భూమ్మీదకు రానున్నారు.

Read Also:  అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Related News

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

Big Stories

×