Big Stories

Sri Rama Navami: రామనవమి రోజున గజకేసరి యోగం.. ఊహించని సంపద, శక్తి.. పూజ ఎలా చేయాలో తెలుసా?

 

- Advertisement -

Sri Rama Navami: ప్రతి ఏటా చైత్ర మాసంలో వచ్చే నవమి రోజున శ్రీ రామనవమి( రాముని జన్మదినం)ని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీరామ నవమి అంటే రాముడి జన్మదినం మాత్రమే కాదు.. శ్రీ సీతా రాముల వారి కళ్యాణం జరిగిన రోజు కూడా. ఇదే రోజు రాముల వారు అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం జరిగిన రోజు. అందువల్ల హిందువులు ఈ రోజును అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజుగా పరిగణిస్తారు. వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం రామయ్య శ్రీరామనవమి నాడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు, తొమ్మిది శుక్లపక్ష పవిత్ర దినాలలో ఒకటైన అభిజిత్ నక్షత్రంలో రాముల వారు జన్మించారు.

- Advertisement -

ఈ ఏడాది శ్రీరాముల వారి జాతకంలో ఓ అద్భుతం జరగనుందట. రాముల వారి జాతకంలో గజకేసరి యోగం ఏర్పడనుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఈ ఏడాది రామనవమి అనేది ప్రజలకు చాలా పవిత్రమైన రోజుగా మారనుందని అంటున్నారు. గజకేసరి యోగం అంటే వ్యక్తి యొక్క గజానికి(ఏనుగుకి) సమానమైన శక్తి, సందలను పొందుతాడని అర్థం. అయితే ఈ ఏడాది గజకేసరి యోగం వరించడంతో అత్యంత శుభప్రదంగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది ఏర్పడిన రామనవమి నాడు చేసే పూజలు ఫలించనున్నాయని పండితులు చెబుతున్నారు.

పూజ సమయం..

శ్రీ రామనవమి నాడు శుభముహుర్తాలు ఉన్నాయట. ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 1.40 గంటల మధ్య అభిజిత్ ముహుర్తం ఉన్నట్లు పండితులు తెలిపారు. ఈ సమయాల్లోనే రాముల వారికి హారతి ఇవ్వాలని, పూజాభిషేకం, గృహప్రవేశం, ప్రారంభోత్సవాలు, వంటి శుభకార్యాలకు ఇది అరుదైన ముహుర్తం అని చెబుతున్నారు. పూజలో రాములవారితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఫోటోను పెట్టి పూజించాలట. పూజలో అంక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ, దీపం, కర్పూరం, పువ్వులు వంటి సామాగ్రిని సమర్చుకోవాలి. శ్రీరాముడిని నవమి రోజు అభిషేకం చేయడం చాలా మంచిది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె వంటి వాటితో అభిషేకం చేయడం మంచిది. రాముల వారి పట్టాభిషేకం, కళ్యాణానికి బట్టలు పెట్టాలి. రామాయణపుస్తకం, తమలపాకు వంటివి సమర్చుకోవాలి.

Also Read: రామ నవమికి బాలరాముడి భక్తులకు మహా ప్రసాదం.. లక్ష మఠాడీల నైవేద్యం!

రాముల వారి పూజా విధానం..

ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి. పువ్వులతో తోరణాలు, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించాలి. అనంతరం రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యదర్శనం అనంతరం, తులసి దేవికి పూజ చేయాలి. ఇక పూజా గదిలో తొలుత అన్ని గణాలకు అధిపతి అయిన గణపయ్యను ప్రతిష్టించి పూజించాలి. అనంతరం కలుషాన్ని పెట్టి రాముల వారిని పూజించాలి. రాముల వారికి అభిషేకం, అలంకరణ పూర్తి చేసిన అనంతరం పువ్వులతో పూజ చేస్తూ దీపారాధన చేయాలి. అనంతరం రాముల వారి నామాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం రాములవారికి ఇష్టమైన నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. ఇక కొబ్బరి కాయ కొట్టి హారతి ఇచ్చి రాముల వారిని మనసారా దీవించమని కోరుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News