Aishwarya Rai Bachchan:బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) జంట కూడా ఒకటి. ఇక వీరి కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా ఇండస్ట్రీకి సుపరిచితురాలైన అమ్మాయే.. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan) తాజాగా కోర్టు మెట్లెక్కింది. మరి ఇంతకీ ఇంత చిన్న ఏజ్ లో ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) కి కోర్టుమెట్లెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అసలు జరిగిన విషయం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
అప్పుడే పెద్దది అయిపోయిన బిగ్ బీ మనవరాలు..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amithab Bachchan )వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ బచ్చన్ తండ్రి పేరును ఉపయోగించుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక మిస్ వరల్డ్ అలాగే హీరోయిన్ అయినటువంటి ఐశ్వర్యరాయ్ ని ప్రేమించి పెళ్లాడారు. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఆరాధ్య బచ్చన్ అనే పాప కూడా జన్మించింది.అయితే ఆరాధ్య బచ్చన్ అప్పట్లో చాలా క్యూట్ గా చిన్నగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె పెద్దది అయిపోయింది. ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోతున్నారు..
ఆరాధ్య పై అసత్య ప్రచారాలు..
ఆరాధ్య బచ్చన్ ఏంటి ఇంత తొందరగా పెద్దయింది అని షాక్ అయ్యారు. ఇక ఆరాధ్య బచ్చన్ అచ్చం తల్లి పోలికలతో ఉండడంతో ఈ అమ్మాయి కూడా ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అంతటి హీరోయిన్ అవుతుంది అని చాలామంది ఆరాధ్య బచ్చన్ ఫొటోస్ చూసి కామెంట్లు పెట్టారు. అయితే ప్రస్తుతం ఆరాధ్య బచ్చన్ దృష్టి మొత్తం స్టడీస్ పైనే ఉంది. అయితే సడన్గా ఆరాధ్య బచ్చన్ కోర్టుమెట్లు ఎక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే..ఆరాధ్య బచ్చన్ పై చాలా రోజుల నుండి కొన్ని ఫేక్ వార్తలు ప్రచురితమవుతున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే కొన్ని వెబ్ సైట్ లలో పదేపదే ఆరాధ్య బచ్చన్ కి సంబంధించి రూమర్లు ప్రచారం చేస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే ఏకంగా “ఆరాధ్య ఇక లేరు” అన్నట్లుగా వీడియో క్రియేట్ చేశారు. ఇక దీనిపై ఫైర్ అయిన అభిషేక్ బచ్చన్ వెంటనే వెళ్లి కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం వెంటనే ఆరాధ్య బచ్చన్ పై వచ్చిన ఫేక్ వార్తలు అన్నింటిని యూట్యూబ్ నుండి వెబ్ సైట్స్ నుంచి తొలగించాలని గట్టిగా మందలించారు.
హైకోర్టు మెట్లెక్కిన చిన్నారి..
అయితే న్యాయస్థానం మాటలను పట్టించుకున్న కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోలను తొలగించినట్టే తొలగించి , మళ్లీ ప్రసారం చేయడంతో ఈ విషయంలో మళ్ళీ అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ(Abhishek Bachchan family) కోర్టు మెట్లెక్కింది. చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి అలాంటి వార్తలు ప్రచారం చేయకూడదు అని కోర్టు మందలించినప్పటికీ, ఆ యూట్యూబ్ వెబ్ సైట్స్ వాళ్లు ఏమి పట్టనట్లుగా ఉండి తాత్కాలికంగా తొలగించి మళ్లీ ప్రసారం చేయడంతో దీనిపై ఫైర్ అయిన ఆరాధ్య బచ్చన్ వెంటనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. అలా సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం కూడా ఉంది అని ప్రతిసారి నిరూపితం అవుతూనే ఉంది. కొంత మంది దీన్ని యూస్ చేసుకుంటే మరి కొంత మంది మిస్ యూస్ చేస్తూ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.