Bunny Vasu: టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన బన్నీవాసు.. ఆ తరువాత నెమ్మదిగా గీతా ఆర్ట్స్ లో భాగమయ్యాడు. అల్లు అరవింద్ సమర్పిస్తూ.. బన్నీవాసు నిర్మాతగా మారి చాలా హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు. 100% లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీత గోవిందం.. ఇలా చెప్పుకుంటూ పోతే బన్నీవాసు నిర్మాణంలో మంచి హిట్స్ నే పడ్డాయి.
గతేడాది ఆయ్ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆయ్.. పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం తండేల్. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడం తో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు.
ఒకపక్క నాగచైతన్య, సాయిపల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి, అల్లు అరవింద్ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుంటే.. ఇంకోపక్క బన్నీవాసు ఒక్కడే కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలలో ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా బన్నీవాసు .. గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నాడని, కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఆ వార్తలకు చెక్ పెట్టాడు బన్నీవాసు.
Akka: అమ్మ బాబోయ్.. కీర్తీ అక్కా.. బోల్డ్ కంటెంట్ లోకి నువ్వు కూడా దిగావా..
త్వరలోనే బన్నీవాసు కొత్త బ్యానర్ పెడుతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి అవకాశం ఏమైనా ఉందా.. ? అన్న ప్రశ్నకు బన్నీవాసు మాట్లాడుతూ.. ” లేదండీ.. అది చాలా రాంగ్ గా కమ్యూనికేట్ అవుతుంది. అరవింద్ గారికి, నాది 25 ఏళ్ల ప్రయాణం. నాకు కొన్ని సొంత టేస్ట్ లు ఉంటాయి. అరవింద్ గారికి కొన్ని సొంత టేస్ట్ లు ఉంటాయి. ఇప్పటివరకు ఎలా ఉండేది అంటే.. ఇద్దరికీ ఒక కాంబినేషన్ ఉండేది. నాకు నచ్చని సినిమాలు ఆయన డ్రాప్ అయ్యారు. ఆయనకు నచ్చని సినిమాలు నేను డ్రాప్ అయ్యాను.
నేను ఆయనను అడిగింది ఏంటంటే.. కొన్ని సినిమాలు నాకు నచ్చితే.. ఒకవేళ ఆ సినిమా మీకు నచ్చకపోతే.. ఆ సినిమా నేను చేసుకోవచ్చా.. అని అడిగాను. ఆయన కూడా నువ్వు చేసుకో.. కానీ, మొదట కథ నాకు వినిపించు అన్నారు. అందులో కూడా ఆయన 100% పార్ట్ ఉంటుంది. కాకపోతే ఆ పర్మిషన్ ఒక్కటి ముందు ఆయనను అడిగి చేసేవాడిని. ఇప్పుడు నాకు నచ్చిన కథ ఉంటే కనుక ఆయనకు చెప్పకుండానే ఓకే చేస్తున్నాను. ఆ అప్షన్ ఇచ్చారు. కొత్త బ్యానర్ అని ఏమి లేదు. నేనే సినిమా చేసినా గీతా ఆర్ట్స్ లోనే చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.