BigTV English

Jay Shah Says on Rahul Dravid: త్వరలో కోచ్ పదవికి నోటిఫికేషన్.. ఇంపాక్ట్ రూల్‌పై జై షా మాట!

Jay Shah Says on Rahul Dravid: త్వరలో కోచ్ పదవికి నోటిఫికేషన్.. ఇంపాక్ట్ రూల్‌పై జై షా మాట!

Jay Shah Says Rahul Dravid Can Apply for Team India Coach: టీమిండియాకు కొత్త కోచ్ ఎవరు? బీసీసీఐ ఎవరి వైపు చూపుతుంది? విదేశీ వైపా? స్వదేశీ కోచ్‌నా? ఈసారి ఎవరిని ఎంపిక చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ఆస్ట్రేలియాతోపాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే బీసీసీఐని కొందరు మాజీలు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా కొత్త కోచ్‌‌పై త్వరలో ప్రకటన వస్తుందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చేశారు.


నార్మల్ అయితే ప్రస్తుతమున్న కోచ్ రాహుల్‌ద్రావిడ్ పదవీకాలం గతేడాది నవంబర్‌తో ముగిసింది. 2021 నుంచి 2023 వరకు ఆయనే కొనసాగాడు. టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేయడంతో ఆయన కంటిన్యూ అవుతున్నాయి. ఆ టోర్నీ ముగియగానే రాహుల్‌ద్రావిడ్ తప్పుకోవడం ఖాయమన్నమాట. ద్రావిడ్ కూడా కంటిన్యూ కావడానికి సుముఖంగా లేరన్నది క్రికెట్ వర్గాలు చెబుతున్న మాట. ద్రావిడ్ కూడా మళ్లీ కోచ్‌గా రావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చని జై షా సూచనప్రాయంగా చెప్పారు.

ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది బీసీసీఐ. దీనిపై మాట్లాడిన జై షా, రాహుల్ పదవీకాలం జూన్ వరకు మాత్రమే ఉందని, ఒకవేళ కోచ్‌గా వస్తానంటే ఆయన దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరిని తీసుకోవాలనే దానిపై క్రికెట్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంద న్నారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తారా? లేక ఒకే కోచ్‌ను తీసుకుంటారా? ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్‌లో ఆడే ఆటగాళ్లు ఉన్నారని గుర్తు చేశారు జై షా.


Also Read: Shubman Gill: చెన్నైపై విజయం.. గిల్‌కు భారీ షాక్..

ఇదిలావుండగా ఐపీఎల్ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ రూల్స్‌పై నోరు విప్పారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఈ నిబంధనను కేవలం టెస్టింగ్ కోసం ఇంట్రడ్యూస్ చేశామన్నారు. దీనివల్ల ఇద్దరు ఆటగాళ్లు ఆడే ఛాన్స్ వస్తుందన్నారు. బయట నుంచి వస్తున్న విమర్శలపై చర్చిస్తామన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రాంచైజీలతో మాట్లాడుతామన్నారు. ఇదేమీ శాశ్వతం కాదని, ఎవరి నుంచి ఫీడ్ బ్యాక్ రాలేదని వెల్లడించారు.

పొరుగు దేశం పాకిస్థాన్ విషయానికొద్దాం. టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కోచ్‌గా తీసుకుంది ఆ దేశం. బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్లెస్పీ‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీసీసీఐ ఎటువైపు మొగ్గు చూసుతుందో చూడాలి.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×