BigTV English

Abhinav Gomatam: బిగ్ బాస్ 8 కి టాలీవుడ్ హీరో కమ్ కమెడియన్ ఎంట్రీ?

Abhinav Gomatam: బిగ్ బాస్ 8 కి టాలీవుడ్ హీరో కమ్ కమెడియన్ ఎంట్రీ?

Abhinav Gomatam in Bigg Boss season 8 viral news : ఇక్కడ వినోదం అన్ లిమిటెడ్ ఈ సారి డబుల్ డోస్ అంటూ ప్రోమోలలో నాగార్జున ఊదరగొట్టేస్తున్నారు. వినోదం మాట ఎలా ఉన్నా విసుగెత్తించకుండా ఉంటే చాలని ఆడియన్స్ అంటున్నారు. మొదట్లో బాగానే ఉన్నా రానురానూ కంటెస్టంట్లంతా సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు . ఇప్పటిదాకా బిగ్ బాస్ విన్నర్స్ ని గమనిస్తే యారగెంట్ బిహేవియర్ ఉన్నవాళ్లే గెలుస్తూ వస్తున్నారు. అంటే బిగ్ బాస్ లో జరిగే అన్యాయంపై పోరాడే వారికే జనం పట్టం కడుతున్నారు. సాధ్యమైనంత వరకూ పొరుగువారితో వీళ్లు పోట్లాడుతూనే ఉంటారు సందర్భం దొరికినప్పుడు హీరోగా నిరూపించుకునేందుకు తంటాలు పడుతుంటారు. మొత్తానికి సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు కొద్దిగా శ్రమపడక తప్పదంటున్నారు. ఇక లేడీ కంటెస్టెంట్లు ఎంత గ్లామరస్ గా కనిపించినా పాపం విన్నర్ కాలేకపోతున్నారు.


ముందే తెలిసిపోతున్న విషయాలు

టాప్ 5 కంటెస్టెంట్ రేసు వరకే పరిమితం అవుతున్నారు. ప్రతి సారీ నెక్ట్స్ వెళ్లిపోయే కంటెస్టెంట్ ఎవరో ఆడియన్స్ ఈజీగా కనిపెట్టేస్తున్నారు. కేవలం వారికి వచ్చే ఓటింగ్ ఆధారంగా ఓ డిసైడ్ కు వచ్చేస్తున్నారు. అదొక్కటే మైనస్ గా కనిపిస్తోంది. అందరినీ కొత్తవాళ్లను తీసుకుంటే జనం వాళ్లను చూడటానికి ఇబ్బందులు పడుతున్నారు. కాస్త ముఖ పరిచయం ఉన్నవారయితే వెంటనే కనెక్ట్ అవుతున్నారు. అయితే చాలా మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ తర్వాత తమకు బోలెడు అవకాశాలు వస్తాయని అంచనాలతో వస్తున్నారు. కానీ వారు ఊహించినదానికి భిన్నంగా అవకాశాలు రావడం లేదని అంటున్నారు కంటెస్టెంట్లు. బిగ్ బాస్ విన్నర్ల పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటిదాకా బిగ్ బాస్ విన్నర్లకు బయట మాత్రం గోల్డెన్ ఛాన్సులు దక్కడం లేదు.


కన్ఫాం కాలేదు

ఈ సారి కంటెస్టెంట్ల వివరాలు చాలా గోప్యంగా ఉంచారు. వాళ్లొస్తున్నారు..వీళ్లొస్తున్నారంటూ మాటలే తప్ప ఎవరూ కన్ఫామ్ గా తెలియడం లేదు. ఇప్పుడు అలాగే మరో పేరు బయటకు వచ్చింది. అతనే అభినవ్ గోమఠం. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్లలో ఒగరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు అభినవ్ గోమఠం. మీమర్స్ కు అభినవ్ టాలెంట్ ఏమిటో బాగా తెలుసు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో ..అట్ కమల్ హాసన్ అనే డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కామెడీ టైమింగ్ తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. సేవ్ టైగర్స్ అనే వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు అభినవ్ గోమఠం. ఇప్పుడిప్పుడే హీరో కమ్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అభినవ్. అయితే తన కామెడీ టైమింగ్ తో అభినవ్ తప్పకుండా బిగ్ బాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాడని అంటున్నారు అంతా..కాకపోతే ఇంతవరకూ అఫిషియల్ గా ఎలాంటి ప్రకటనా రాలేదు.

వినోదం డోస్ పెంచేందుకే..

ఇటు అభినవ్ గానీ..అటు బిగ్ బాస్ నిర్వాహకులు గానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. గతంలో తేజ తన కామెడీతో బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పూయించాడు. దాదాపు పది వారాల దాకా తేజ ఎంటర్ టైన్ చేయగలిగాడు. అందుకే ప్రేక్షకులు విసుగు లేకుండా బిగ్ బాస్ ను ఆస్వాదించగలిగారు. అయితే ఈ సారి కూడా అభినవ్ గోమఠం ను తీసుకోవడానికి రీజన్ అదేనంటున్నారు. ఎంతసేపూ వీళ్లు కొట్టుకోవడం, తిట్టుకోవడమే తప్ప కామెడీకి ఎవరూ ట్రై చేయడం లేదని అందుకే ఈ సారి ఎలాగైనా వినోదం పెంచే ప్రక్రియలో మరికొందరు కమెడియన్స్ కు చోటు దొరుకుతుందని భావిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×