BigTV English
Advertisement

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. బిగ్ అనౌన్స్మెంట్ లోడింగ్, ఒకటి కాదు రెండు?

Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. బిగ్ అనౌన్స్మెంట్ లోడింగ్, ఒకటి కాదు రెండు?

Akhil Akkineni: అఖిల్ అక్కినేని కటౌట్‌కి సరైన కథలు పడి ఉంటే.. ఈపాటికే పాన్ ఇండియా హీరో లిస్ట్‌లో ఉండేవాడు. కానీ కెరీర్ స్టార్టింగ్ నుంచి అఖిల్ ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న అఖిల్.. చివరగా భారీ ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చింది. ఈ సినిమా రెండేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిందంటే.. ఏజెంట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌.. ఇటీవలే సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. లేటెస్ట్‌గా.. అఖిల్ ఒకేసారి రెండు సినిమాల ప్రకటనకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లగా.. కొత్త సినిమా కొత్త దర్శకుడితో ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు.


లెనిన్ ఫిక్స్?

ప్రస్తుతం ఆయన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హైదరాబాద్‌లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు “లెనిన్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఉంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్తూరు జిల్లాలోని రూరల్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ నచ్చి స్వయంగా నాగార్జుననే తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే.. ఆరోజు ఈ సినిమాతో పాటు మరో సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.


ఇది కూడా ఫిక్స్?

వాస్తవానికైతే.. అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్ అనే కొత్త దర్శకుడితో.. భారీ సోషియో ఫాంటసీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఇది వర్కౌట్ కాలేదు. దీంతో.. “లెనిన్” మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత సామజవరగమన కో-రైటర్‌ నందుతో ఒక సూపర్ ఎంటర్‌టైనర్ సినిమా చేయనున్నాడనే బజ్ ఉంది. ఇది ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉందట. ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరించే అవకాశమున్నట్లు టాక్​. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఖచ్చితంగా అఖిల్ ఈ సినిమాలతో సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే.. ఆచితూచి అడుగులేస్తున్నాడని చెప్పొచ్చు. ఒక్క సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇంత గ్యాప్ తీసుకున్నాడంటే.. ఈసారి అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ లెక్క వేరేలా ఉండేలా కనిపిస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×