E-Paper
Advertisement

Salaar Part 2: సలార్ 2 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. అఫీషియల్‌గా చెప్పేసిన నటుడు

Salaar Part 2: సలార్ 2 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. అఫీషియల్‌గా చెప్పేసిన నటుడు
Advertisement

Salaar Part 2 update

Salaar Part 2 update(Latest news in tollywood): ప్రభాస్ సినీ కెరీర్ అయిపోయింది అనే టైంలో సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందరినీ ఊహలను చెరిపేసింది. ఎన్నో సినిమాల తర్వాత ప్రభాస్‌కి, ఆయన అభిమానులకు సలార్ మూవీ ఆకలిని తీర్చింది. ఈ మూవీతో ప్రభాస్ మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని అందుకుంది.

Advertisement

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అదరగొట్టేసింది. హూంబల్ ఫిల్మ్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో రిలీజై అందరినీ అలరించింది. ఇక ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. అంతేకాకుండా భారీ తారాగణం ఈ మూవీలో నటించింది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌, బాబీ సింహాతో పాటు మరికొంత మంది స్టార్ నటీనటులు ఇందులో కీలక పాత్ర పోషించారు.

థియేటర్లలో దుమ్ముదులిపేసిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలోకి వచ్చి అదరగొట్టేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చి ఆడియన్స్‌ను అలరించింది. ఇక ఓటీటీలో కూడా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక ఈ భాషల్లోనే కాకుండా స్పానిష్ భాషలో ఈ మూవీని డబ్ చేసి మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో రిలీజ్ చేయనున్నారు.

Advertisement

READ MORE: తొలిసారి ఆ భాషలో అందుబాటులోకి ప్రభాస్ ‘సలార్’.. కాలర్ ఎగరేస్తోన్న ఫ్యాన్స్..

అంతేకాకుండా జపాన్లో కూడా ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇదంతా ఇలా ఉంటే.. ఈ మూవీ రెండో పార్ట్‌పై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సెకండ్ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలు కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సెకండ్ పార్ట్‌కి సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చి వైరల్‌గా మారింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌లో నటించిన నటుడు బాబీ సింహ ఈ మూవీ సెకండ్ పార్ట్‌పై అదిరిపోయే అప్డేట్ అందించాడు.

READ MORE: నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ‘సలార్’.. ఏయే స్థానాల్లో అంటే..?

ఓ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కావచ్చని అన్నాడు. అంతేకాకుండా ఈ పార్ట్ 2 కోసం తాను కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ ప్రియులు, ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×