BigTV English

Salaar – Prabhas: తొలిసారి ఆ భాషలో అందుబాటులోకి ప్రభాస్ ‘సలార్’.. కాలర్ ఎగరేస్తోన్న ఫ్యాన్స్..

Salaar – Prabhas: తొలిసారి ఆ భాషలో అందుబాటులోకి ప్రభాస్ ‘సలార్’.. కాలర్ ఎగరేస్తోన్న ఫ్యాన్స్..

Salaar – Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. లాస్ట్ ఇయర్ చివర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇటు ప్రభాస్‌, అటు అభిమానుల ఆకలిని తీర్చింది. ఎన్నో సినిమాల తర్వాత ప్రభాస్ ఈ మూవీతో మంచి కంబ్యాక్ అయ్యాడు. హూంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.


పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబుతో సహా స్టార్ నటులు ఈ మూవీలో నటించి అలరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళతోపాటు ఇతర భాషల్లో రిలీజై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లు రాబట్టింది.

అనంతరం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ మేరకు టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.


తాజాగా సలార్ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీంతో ఈ మూవీ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు మరింత చేరువ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీని స్పానిష్ భాషలో డబ్ చేసి మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

అంతేకాకుండా జపాన్‌ దేశంలో కూడా ఈ సమ్మర్‌లో ‘సలార్’ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తమ అభిమాన హీరో సినిమాను ఇన్ని దేశాల్లో విస్తరిస్తున్నందుకు అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఈ మూవీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండో పార్ట్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ సెకండ్ పార్ట్‌తో పాటు ప్రభాస్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ‘కల్కి 2898AD’ మూవీ, ‘రాజా సాబ్’ మూవీలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న ‘స్పిరిట్‌’ మూవీ కూడా త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×