BigTV English

Delhi Budget 2024-25: విద్యారంగానికి పెద్దపీట.. 16 వేల కోట్లు కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం..

Delhi Budget 2024-25: విద్యారంగానికి పెద్దపీట.. 16 వేల కోట్లు కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం..

Delhi BudgetDelhi Budget Allocations to Educational Sector for 2024-25: ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించింది.


ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషీ సింగ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ₹ 76,000 కోట్లతో ‘రామరాజ్యం’ బడ్జెట్‌ను సమర్పించారు. ఒక్క విద్యా రంగానికే 16 వేల కోట్లు కేటాయించారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి అతిషీ సింగ్ (Athishi Singh) మాట్లాడుతూ నగరవాసులకు నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.


కేజ్రీవాల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు గణనీయంగా మారాయని మంత్రి హైలైట్ చేశారు.

గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు తీసుకొచ్చామని, దేశ రాజధానిలో విద్యారంగానికి రెట్టింపు బడ్జెట్‌ను పెంచామని, ఈరోజు ఢిల్లీలో విద్యారంగానికి రూ.16,396 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.

Read More: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..

“కేజ్రీవాల్ ప్రభుత్వానికి ముందు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి బాగా లేదు. ప్రజలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి చదవవలసి వచ్చేది,” అని విద్యా శాఖ మంత్రి అతిషీ తెలిపారు.

ఢిల్లీలో విద్యారంగాన్ని మెరుగుపరచడంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గణనీయమైన పాత్ర పోషించారని అతిషీ అన్నారు.

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణపై కసరత్తు చేస్తోందని, ఇప్పటి వరకు 47,914 మంది టీచర్లను రెగ్యులర్ చేసిందని, ప్రస్తుతం 7,000 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

Read More: మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతా.. ఈడీకి కేజ్రీవాల్ సమాధానం..

కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలు మెరుగయ్యాయని, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించారని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ-ఇన్‌స్టిట్యూట్‌లలో మొత్తం 93,000 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాల్లో సీట్లు 20,000 పెరిగాయని అతిషి పేర్కొన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 76,000 కోట్లతో సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో అతిషి బడ్జెట్‌ను సమర్పించారు. ‘రామరాజ్యం’ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×