BigTV English

Pushpa2 : ఇదెక్కడి గుండులో మోసంరా షేకావత్తు… సుక్కు ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు..

Pushpa2 : ఇదెక్కడి గుండులో మోసంరా షేకావత్తు… సుక్కు ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు..

Pushpa2 : గత ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప 2.. ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్స్ ను వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీకి గతంలో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని అందుకుంది. దాంతో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు మలయాళ యాక్టర్ ఫహద్‌ ఫాజిల్‌. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో అదరగొట్టాడు. అయితే ఆయన పాత్రకు సంబందించిన ఓ సీక్రెట్ రీవిల్ అయ్యింది.. అదేంటంటే..


ఈ మూవీలో స్మగ్లింగ్ చేస్తున్న పుష్పరాజును ఢీకొట్టేలా ఐపీఎస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ శకవత్ పాత్ర ఉంటుంది.. ఆ పాత్రలో ఫహద్ పజిల్ నటించారు. సుకుమార్ అతడి పాత్రను చాలా స్పెషల్ గా డిజైన్ చేసాడు. నున్నటి గుండు, గుండు మీద ఓ గాటుతో డిఫెరెంట్ లుక్ లో కనిపించాడు. పార్టీ లేదా పుష్ప అంటూ అతను చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా ఇదే డైలాగ్ ట్రెండ్ అవుతుంది. మొదటి పార్ట్ లో ఎలాగైతే తన డైలాగులతో యాక్షన్ తో మెప్పించాడు. పార్ట్ 2 లో కూడా తనవంతు కృషి చేసి మూవీ హిట్ అవ్వడానికి కీలక పాత్రను పోషించాడు..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడింటిని అస్సలు మిస్ అవ్వకండి..


అయితే పుష్ప లో షేకావత్ పాత్ర రియల్ కనిపించాలని నిజంగానే గుండు కొట్టించుకున్నాడేమో అని అందరు భావించారు. కానీ అదంతా తూచ్.. నిజం కాదట. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ స్టాప్ ని అందుకోవడం తోపాటు భారీగా కలెక్షన్స్ కూడా అందుకొని అటు ఓటిటిలో కూడా సక్సెస్ స్టాప్ తో దూసుకుపోయిన తర్వాత ఇన్నాళ్లకు అతన్ని రియల్ గుండు కాదని వీడియో బయటికి వచ్చింది. యాక్టర్ బ్రహ్మాజీ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసారు. ‘పుష్ప 2’ సెట్స్ లోని బీటీఎస్ వీడియో ఇది. దీంట్లో ఫహద్‌ బోట్ లో వెళ్తుండగా.. వెనుక నుంచి బ్రహ్మాజీ దాన్ని తన మొబైల్ ఫోన్ లో షూట్ చేసాడు. ఆ వీడియోలో ఫహద్ గుండు పైన వెనకాల ముడతలు పడి ఉండటానికి మనం చూడవచ్చు. అంటే అది రియల్ కాదని ముడతలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఫహద్‌ ఫాజిల్‌ తలను గుండు మాదిరిగా మేకప్ చేసి కవర్ చేశారనే విషయం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, జగపతిబాబు, ధనుంజయ, సునీల్, అజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.. ఇక ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 3 మూవీ కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ మూవీ గురించి అప్డేట్ రానుందని సమాచారం..

?igsh=YnA2ZWNpOG05azJv

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×