హైదరాబాద్ పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో కంగుతినే విషయాలు వెలుగుచూశాయి. పాతబస్తీ అడ్డాగా మటన్ మాఫియా దందా నడుస్తోంది. డబిర్‌పురాలో భారీగా కుళ్లిన మటన్ సీజ్ చేశారు. ఈగలు ముసురుతున్న మాంసపు నిల్వలు భారీగా కనిపించాయి. నాలుగు నెలలుగా ఫ్రీజర్‌లో కుళ్లిన మాంసం నిల్వ ఉంచినట్టు తేల్చారు. ఆ మాంసాన్ని పెళ్లిళ్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు. దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతుందీ ముఠా. అక్రమ నిల్వల వ్యాపారి ముస్బా ఉద్దీన్ గోడౌన్ పై.. టాస్క్ ఫోర్స్ పోలీసులు, GHMC సిబ్బంది దాడి నిర్వహించి మాంసపు నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం రవాణా అవుతోంది. మురికి కాల్వల పక్కన మటన్ షాపులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం మంగళ్‌హాట్‌లో 12 క్వింటాళ్లు, డబిల్‌పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజలు తింటున్న ఆహారాన్ని కొంతమంది కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసిన ఆహారం తిన్నప్రజలు రోగాలబారిన పడి ఆసుపత్రుల పాలవుతుంటే.. అక్రమార్కులు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు. కల్తీ పుడ్ అమ్ముతున్న రెస్టారెంట్ల పై పుడ్ సెఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేసి కల్తీగాళ్లను కటకటాల పాలుచేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్
హైదరాబాద్ మాదాపూర్ లోని క్షత్రియ ఫుడ్స్ రెస్టారెంట్ లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. వంట గదిలో ఈగలు, బొద్దింకలు సంచారిస్తున్నాయని తెలిపారు. ఆహార పదార్థాలపై కృత్రిమ రంగులు వేసినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కూరగాయలు, మాంసహార పదార్థాలను ఒకటే ఫ్రీజ్ లో నిల్వ చేశారని అధికారులు తెలిపారు. క్షత్రియ ఫుడ్స్ రెస్టారెంట్ నిర్వహహకులు ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించలేదని చెప్పారు. క్షత్రియ ఫుడ్స్ కు ఏలాంటి పెస్ట్ కంట్రోల్ రికార్డు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, వాటర్ అనాలసిస్ రిపోర్ట్ లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.