BigTV English
Advertisement

Kamal Haasan: తీవ్ర అస్వస్థతకు గురైన కమలహాసన్ సోదరుడు..!

Kamal Haasan: తీవ్ర అస్వస్థతకు గురైన కమలహాసన్ సోదరుడు..!

Kamal Hassan.. విశ్వ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamal Hassan) సోదరుడు, ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు అయిన చారుహాసన్ (Charu Hassan) తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యానికి గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. గత కొద్ది రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఈయన ఇప్పుడు మళ్లీ హాస్పిటల్ లో చేరడంతో అభిమానులు కలవరపాటుకు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె , ప్రముఖ సీనియర్ నటి సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam)సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తమ అభిమాన నటుడు త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కామెంట్లు చేస్తున్నారు. తన సోదరుడు చారుహాసన్ హాస్పిటల్ లో ఉన్నాడని తెలిసి, ఆయన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.


మా దీపావళి ఎమర్జెన్సీ వార్డ్ లోనే గడిచింది..

తాజాగా చారుహాసన్ కుమార్తె సుహాసిని ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఈ విధంగా రాసుకొచ్చింది.. “దీపావళికి ముందే మా నాన్న చారు హాసన్ అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డ్ లోనే గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధం అవుతున్నారు” అంటూ తన ఇన్స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ అలాగే కమల్ హాసన్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.


చారు హాసన్ నటించిన చిత్రాలు..

చారు హాసన్ విషయానికి వస్తే.. ఇండియన్ సినీ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు చారు హాసన్. తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం, హిందీ సినిమాలలో నటించి పాన్ ఇండియా నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన, 1987లో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన తబరన కథే అనే కన్నడ సినిమాకి గానూ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాదు కర్ణాటక ప్రభుత్వం తరఫున కూడా ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు చారు హాసన్. ఇక ఈయన కమలహాసన్ కు స్వయాన అన్న అవుతారు. అంతేకాదు ప్రముఖ సీనియర్ హీరోయిన్ సుహాసినికి తండ్రి కూడా. ఈయన నటించిన తెలుగు చిత్రాల విషయానికొస్తే.. 1990లో అంకితం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 1995లో వీర, 2002లో నీలాంబరి, 2016లో భేతాళుడు అనే సినిమాలో నటించి, ఆ తర్వాత తెలుగుతెరకు దూరమయ్యాడు.

సుహాసిని కెరియర్..

ఇక సుహాసిని విషయానికి వస్తే.. చారు హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుహాసిని ఆ తర్వాత తన టాలెంట్ తో ఎదిగి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను ప్రేమించి వివాహం చేసుకున్న సుహాసిని, ఇప్పటికీ కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసిని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×