BigTV English

Kannappa: కేన్స్ లో కన్నప్ప టీజర్.. ఫ్రాన్స్ కు బయల్దేరిన మోహన్ బాబు

Kannappa: కేన్స్ లో కన్నప్ప టీజర్.. ఫ్రాన్స్ కు బయల్దేరిన మోహన్ బాబు

Kannappa: మంచు మోహన్ బాబు ఈసారి ఎలాగైనా కొడుకు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మోహన్ బాబు నటవారసుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు, మొదట్లో రెండు మూడు సినిమాలు మంచి హిట్స్ నే అందుకున్నాయి. కానీ, ఆ తరువాత మంచు కుటుంబంపై ట్రోలింగ్ దెబ్బ గట్టిగా పడడంతో మంచు హీరోలకు విజయమే దక్కకుండా పోయింది. మధ్యలో మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా ఎంపిక అవ్వడంతో సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు ఒక్కో సినిమరీలిజ్ చేసినా కూడా ఆశించిన ఫలితం అందలేదు.


ఇక దీంతో మోహన్ బాబునే రంగంలోకి దిగి.. భారీ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. అదే కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా.. సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివన్న, శరత్ బాబు, కాజల్.. ఇలా ఒక్కో స్టార్ ను ఒక్కో పాత్రలో చూపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.

ఇక ఆ టీజర్ లాంచ్ కూడా ఇక్కడ కాదు ఫ్రాన్స్ లో.. ఏంటి నిజమా అంటే అవును.. నిజమే ప్రస్తుతం ఫ్రాన్స్ లో 77 వ కేన్స్ వేడుకలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ వేడుకలకు మంచు మోహన్ బాబుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో కేన్స్ వేడుకల్లోనే కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేయనున్నారట. మే 20 న కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.


ఇక ఈరోజు మోహన్ బాబు ఫ్రాన్స్ కు బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా కేన్స్ లో కన్నప్ప టీజర్ అంటే .. మాములుగా లేదు హైప్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×