BigTV English

Sleep At Work Employee: ఆఫీసులో నిద్రపోయినందకు ఊడిన ఉద్యోగం.. కంపెనీకి రూ.40 లక్షలు జరిమానా!

Sleep At Work Employee: ఆఫీసులో నిద్రపోయినందకు ఊడిన ఉద్యోగం.. కంపెనీకి రూ.40 లక్షలు జరిమానా!

Sleep At Work Employee| ఈ ప్రపంచంలో చాలామంది అన్యాయం జరిగితే సహిస్తారు. ఎదురు తిరిగి పోరాడేవారు చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తి తనకు జరిగిన చిన్న అన్యాయమైనా సహించకుండా కోర్టుకెక్కాడు. జరిగిన దాంట్లో తన తప్పు ఉన్నా అతని వాదన చూసి కోర్టులో న్యాయమూర్తి.. అతనికి నష్టపరిహారం ఇప్పించారు.


వివరాల్లోకి వెళితే.. చైనాలోని జియంగ్‌జు రాష్ట్రం టాయిసింగ్ నగరంలో ఒక కెమికల్ కంపెనీలో డిపార్ట్‌మెంట్ మేనేజర్ గా జాంగ్ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నెల రోజుల క్రితం పనిచేసి ఆఫీసులోనే నిద్రపోయాడు. దానికి కారణం అంతకుముందు రోజు అతను పని ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు ఆఫీసులోనే ఉన్నాడు. ఆ తరువాత ఇంటి కెళ్లి తిరిగి ఉదయాన్నే వచ్చేశాడు.

Also Read:  ఓలా కస్టమర్‌కు షాక్.. స్కూటర్ ధర రూ.లక్ష.. రిపేరు బిల్లు రూ.90,000..


దీంతో ఉదయం బాగా అలసట ఉండడంతో ఆఫీసులో టేబుల్ పైనే కాసేపు తల వాల్చాడు. జాంగ్ ఆఫీసులో నిద్రపోతుండడం కంపెనీ హెచ్ఆర్ సిబ్బంది సిసిటీవి వీడియో ద్వారా చూశారు. రెండు వారాల తరువాత ఆఫీసులో జాంగ్ నిద్రపోయిన విషయాన్ని హెచ్ఆర్ సిబ్బంది జాంగ్ పై చర్యలు తీసుకుంది. ముందుగా కంపెనీ, స్థానిక కార్మిక సంఘానికి జాంగ్ చేసిన తప్పు గురించి నోటీసు ఇచ్చింది. ఆ తరువాత జాంగ్ ను పిలిచి రాతపూర్వకంగా అతను ఆఫీసులో నిద్రపోయాడని అంగీకారం తీసుకుంది. ఆఫీసులో ఎంతసేపు నిద్రపోయావ్ అని హెచ్ఆర్ సిబ్బంది అడిగిన ప్రశ్నకు జాంగ్ అరగంట నుంచి గంట దాకా నిద్రపోయి ఉండవచ్చు అని సమాధానం చెప్పాడు.

జాంగ్ రాతపూర్వకంగా తాను ఆఫీసులో గంటపాటు నిద్రపోయినట్లు రాసిఇచ్చాడు. దీంతో కంపెనీ కఠిన నియమాలను అనుసరించి అతను నిబంధనలు ఉల్లఘించాడని కారణం చూపుతూ జాంగ్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో జాంగ్ షాక్ తిన్నాడు. విషయం ఇంతవరకు వెళుతుందని జాంగ్ ఊహించలేదు. తాను ఇంతకాలం నమ్మకంగా పనిచేసిన కంపెనీ అలా చేస్తుందని అనుకోలేదు.

కంపెనీ తనకు అన్యాయం చేసిందని భావించి జాంగ్ కోర్టులో న్యాయం కోసం పోరాడాడు. కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేశాడు. తాయిసింగ్ నగరంలోని పీపుల్స్ కోర్టులో జడ్డి జు కి ఈ కేసుని విచారణ చేశారు. విచారణ సమయంలో జాంగ్ తన వాదన వినిపిస్తూ.. తాను 20 ఏళ్లుగా కంపెనీ కోసం శ్రమపడ్డానని.. అయితే ఆఫీసులో ముందురోజు ఎక్కువసేపు పనిచేయడం తనకు సరైన నిద్రలేకపోవడంతో మరుసటి రోజు గంటపాటు తన టేబుల్ పైనే కునుకు తీరానన చెప్పాడు. తను చేసిన పని క్రమశిక్షణా రాహిత్యం కిందకు వచ్చినా.. ముందురోజు ఆఫీసులో ఎక్కువ పని ఉండడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పాడు. అయినా మరుసటి రోజు ఆఫీసులో పనిలేని సమయంలో కాసేపు నిద్రపోయానని ఆ మాత్రానికే ఉద్యోగం నుంచి తొలగించడం న్యాయం కాదని చెప్పాడు.

కంపెనీ తరపున లాయర్ మాత్రం అతను నిబంధనలకు ఉల్లఘించి ఆఫీసులో నిద్రపోయాడని.. అతడిపై చర్యలు తీసుకోక పోతే అందరూ కంపెనీలో క్రమశిక్షణతో పనిచేయరని చెప్పాడు.

ఇరువైపు వాదనలు విన్న జడ్జి జు కీ చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఉద్యోగి తప్పుచేస్తే అతనిపై చర్యలు తీసుకునే అధికారం కంపెనీకి ఉంటుంది. జాంగ్ ఆఫీసులో నిద్రపోవడం తప్పుకుండా క్రమశిక్షణ రాహిత్యమే అవుతుంది. కానీ అతను 20 ఏళ్లుగా కంపెనీ కోసం శ్రమపడ్డాడు. ఇంతకుముందు అతను ఎప్పుడూ తప్పుచేసినట్లు ప్రస్తావన రాలేదు. అందువల్ల అతను చేసిన మొదటి తప్పు అని భావించి అతనికి ఏదైనా చిన్న శిక్ష వేస్తే బాగుండేది. పైగా నిబంధనల ఉల్లంఘన వల్ల కంపెనీకి ఏదైనా నష్టం జరిగి ఉంటేనే ఉద్యోగం నుంచి తొలగించాలి కానీ ఇంత చిన్న తప్పు పెద్ద శిక్ష వేయడం సరికాదు.

జాంగ్ పట్ల కంపెనీ అన్యాయం చేసింది. అందుకోసం అతనికి 3,50,000 యుఆన్లు (భారత కరెన్సీ దాదాపు రూ.41.6 లక్షలు) పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×