BigTV English

Manchu Manoj: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్.. దాని అర్ధం ఏంటో తెలుసా.. ?

Manchu Manoj: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్.. దాని అర్ధం ఏంటో తెలుసా.. ?

Manchu Manoj: మంచువారబ్బాయి మనోజ్ ఈ మధ్యనే తండ్రి అయిన విషయం తెల్సిందే. దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్న విషయం విదితమే.. గతేడాది ఈ జంట తమ మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇక ఏప్రిల్ 13 న మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంచు కుటుంబంలోకి మరో వారసురాలు వచ్చింది.


తాజాగా ఈ చిన్నారికి నామకరణ వేడుకను మనోజ్ దంపతులు గ్రాండ్ గా జరిపించారు. చిన్నారికి ఒక అద్భుతమైన పేరును పెట్టి.. అభిమానులను ఆశీర్వదించమని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇక చిన్నారి పేరు దేవసేన శోభ MM గా పెట్టినట్లు తెలిపారు. ఇక దీంతో పాటు ఆ పేరుకు అర్ధం కూడా వారే చెప్పుకొచ్చారు.

” మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ దేవసిన శోభ MM ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే MM పులి అనే తన ముద్దు పేరు ద్వారా మీ అందరికీ బాగా తెలుసు. ఆ పరమేశ్వరుని భక్తులమైన మేము మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన “దేవసేన” పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుండి “శోభ” అనే పేరును తీసుకున్నాము. వారి ఆశీస్సులు ఎల్లపుడూ మా కుటుంబంపై ఉంటాయి.


అన్నయ్య ధైరవ్ నాగిరెడ్డి.. తన చిట్టి చెల్లెలిని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మా మావయ్య గారు శ్రీ భూమా నాగిరెడ్డి గారి వారసత్వం ఇలాగే కొనసాగుతుంది. మా జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ.. మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు శ్రీ మోహన్ బాబు గారు.. శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి.

నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా మౌనిక తోబుట్టువు లైన అఖిల భూమా, విఖ్యాత్ భూమా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. మొదటి నుండి నాకు తోడుగా ఉన్న నా స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఇంటి దీపం, మా కంటి వెలుగు, చిన్నారి దేవసేన శోభకు మీ అందరి దీవెనలు కావాలి” అంటూ మనోజ్ రాసుకొచ్చాడు. ఇక చివర్లో MM అంటే.. మనోజ్, మౌనిక అని అనుకోవచ్చు.. మోహన్ బాబు మంచు అని కూడా అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మీ కుటుంబం ఎప్పుడు ఇలాగే కళకళలాడుతూ ఉండాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం మిరాయ్ అనే సినిమాలో మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చాలా గ్యాప్ తరువాత మనోజ్ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×