BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Promo: ప్రేరణ vs హరితేజ.. చెల్లుకు చెల్లు.. పడింది ఇద్దరికి పెద్ద చిల్లు..

Bigg Boss 8 Telugu Promo: ప్రేరణ vs హరితేజ.. చెల్లుకు చెల్లు.. పడింది ఇద్దరికి పెద్ద చిల్లు..

Bigg Boss 8 Telugu Latest Promo : బిగ్ బాస్ 8లో మరోవారం మరో నామినేషన్స్‌కు సమయం వచ్చేసింది. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో నామినేషన్స్ అంటే ఒక కంటెస్టెంట్ ముందుకు వచ్చి తనకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలి. కానీ గతవారం నుండి బిగ్ బాస్ 8లో నామినేషన్స్ పద్ధతే మారిపోయింది. ఈవారం కూడా ఇద్దరు కాకుండా ఒక్క కంటెస్టెంట్‌నే నామినేట్ చేయాలని, అందుకే జాగ్రత్తగా ఆలోచించి నామినేట్ చేయమని కంటెస్టెంట్స్‌కు తెలిపారు బిగ్ బాస్. అందుకే పాత పగలు అన్నీ తీసి నామినేషన్స్‌లో బయటపెట్టారు కంటెస్టెంట్స్. ముఖ్యంగా ఈ మధ్య నామినేషన్స్‌లో ప్రేరణ ఎక్కువగా హైలెట్ అవుతోంది.


గంగవ్వ ఆన్ ఫైర్… 

తనకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేయడానికి గంగవ్వ ముందు రావడంతో బిగ్ బాస్ ప్రోమో మొదలయ్యింది. తను సీరియస్‌గా నిలబడి చూస్తున్నా కంటెస్టెంట్స్ మాత్రం నవ్వుతూనే ఉన్నారు. తను యష్మీని నామినేట్ చేస్తున్నట్టు చెప్పగానే అందరూ పడిపడి నవ్వారు. ‘‘గౌతమ్ మంచిగానే ఆడతాడు. నీ ఆట విషయానికి వచ్చేసరికి నువ్వు గెలవకపోతే భరించలేవు’’ అంటూ తన స్టైల్‌లో యష్మీని నామినేట్ చేయడానికి గల కారణాన్ని చెప్పింది గంగవ్వ. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి ప్రేరణను నామినేట్ చేసి దానికి తన కోపమే కారణమని చెప్పింది. ఇక గత కొన్నిరోజులుగా హరితేజ, ప్రేరణ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఈ నామినేషన్స్‌లో కూడా అదే కంటిన్యూ అయ్యింది.


Also Read: నామినేషన్ రచ్చ మొదలు.. ఇలాంటి గొడవ ఎక్కడ చూడలేదు భయ్యా..!

చెల్లుకు చెల్లు…

తన క్యారెక్టర్‌ను డిసైడ్ చేసినట్టుగా మాట్లాడడం తనకు నచ్చలేదని కారణం చెప్తూ హరితేజను నామినేట్ చేసింది ప్రేరణ. ‘‘మీరు నన్ను ఫేక్ ఫేస్ అనడం నచ్చక అటాక్ చేశాను తప్పా’’ అని హరితేజ చెప్తుండగానే అందరిపై ఇలాగే అటాక్ చేశారా అంటూ ప్రశ్నించింది ప్రేరణ. ‘‘ముందు అటాక్ మొదలుపెట్టింది మీరే’’ అని హరితేజ చెప్పగా.. దానికి ప్రేరణ ఒప్పుకోలేదు. ‘‘ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయ్యిందో నాకు క్లారిటీ ఉంది. నీకు నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావు’’ అంటూ గట్టిగా చెప్పింది హరితేజ. ‘‘మీ ప్రయాణమే ఇంత’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది ప్రేరణ. ‘‘మీరు హరితేజనే ఇంత అని చెప్పారు. చెల్లుకు చెల్లు. పడింది నీకు, నాకు చిల్లు’’ అంటూ తను కూడా వ్యంగ్యంగానే సమాధానమిచ్చింది హరితేజ.

గతవారం జరిగింది గుర్తుపెట్టుకొని… 

‘‘నా ఫేవరెట్స్ కాకుండా ఒకరిని నామినేట్ చేయాలని అనుకొని నువ్వు నన్ను నామినేట్ చేశావని నాకు అనిపించింది. గట్టి పాయింట్స్ లేని దగ్గర ఏదో ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేయొద్దని నా ఫీలింగ్’’ అంటూ విష్ణుప్రియా తనను గతవారం నామినేట్ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు నబీల్. ‘‘నేను కావాలని నిన్ను అటాక్ చేయాలనుకుంటే చాలా కారణాలు తీయచ్చు’’ అంటూ నబీల్ చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు హరితేజ. మొత్తానికి ఈవారం కంటెస్టెంట్స్ ఒక్కరినే నామినేట్ చేయాలని చెప్పినా కూడా అందరి మధ్య బాగానే గొడవలు జరిగాయని ఇప్పటివరకు విడుదలయిన ప్రోమోలు చూస్తే తెలుస్తోంది.

Related News

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Big Stories

×