Manchu Mohan Babu: మంచు కుటుంబంలో ఆస్తితగాదాలు రోడ్డెక్కాయి. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు.. కొడుకు మనోజ్ పై కేసు పెట్టడం.. మనోజ్, తండ్రిపై కేసు పెట్టడం జరిగిపోయాయి. ఇక ఈ గొడవల నేపథ్యంలో మనోజ్ ను తన ఇంటి నుంచి పంపించేయడానికే మోహన్ బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జలపల్లిలో ఉన్న తన ఇంటివద్ద ఇప్పటికే వెహికల్స్ ను రప్పించి, మనోజ్ వస్తువులను అందులో ఎక్కిస్తున్నట్లు సమాచారం.
ఇంకోపక్క మనోజ్.. మోహన్ బాబు ఇంటి లోపలి వెళ్ళడానికి ప్రయత్నించాడు. మంచు మనోజ్ కారును గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయాడు. అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగాడు. ఇక లోపలి వెళ్లిన మనోజ్ పై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో మనోజ్ చొక్కా చినిగిపోయింది. అయినా కూడా మనోజ్ లోపలికి వెళ్లాలని, లోపల తన కూతురు ఉందని చెప్పుకొచ్చాడు. తన ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని వదలనని వార్నింగ్ ఇచ్చాడు.
ఇక ఈ గందరగోళంలో మోహన్ బాబు సైతం మీడియాపై ఫైర్ అయ్యాడు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశాడు. మైక్ పట్టుకొని మీడియా ప్రతినిధి బుర్ర బద్దలుకొట్టాడు. ఇక దీని తరువాత కొడుకు మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఒక ఆడియో సందేశాన్ని పంపాడు. అందులో కొడుకు గురించి మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు.
“మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని నేను ఎలా పెంచాను. అందరికంటే మనోజ్ నిన్నే గారాబంగా పెంచాను. నీకే నేను ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా చిన్నప్పటినుంచి కాదనుకుండా నీకు ఇచ్చాను.
ఈరోజు భార్య మాటలు వినినా గుండెల మీద తన్నావు. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు. ఇంట్లో వారిని ఎందుకు కొడుతున్నావ్. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపం. నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అయినా కాపాడాను. విద్యాసంస్థల్లో ప్రతీది లీగల్‌గా ఉంది, తప్పులు ఎక్కడా జరగలేదు. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు.. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు.
రోడ్డు ఎక్కి నా పరువు తీశావు.. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. వద్దా అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం.. నా తండ్రి నాకేమి ఇవ్వలేదు. నేను సంపాదించుకున్నా ఇదంతా. నా మనసు ఎంతో ఆవేదనతో పొంగిపోతుంది. నా బిడ్డ నన్ను తాకలేదు కొన్ని కారణాలవల్ల మేమిద్దరం గొడవ పడ్డాము ప్రతి కుటుంబంలోని ఈ ఘర్షణలు ఉంటాయి.
నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్.నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను.నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు.జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. ఇకనైనా ఆపేయ్. నీ కూతురిని పోలీసుల సమక్షంలో ఇస్తాను” అంటూ ఆడియో సందేశం పంపాడు. మరి ఈ ఆడియోపై మనోజ్ ఏమంటాడో చూడాలి.