Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి చాలా మంచి పేరుంది. ముఖ్యంగా దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao)తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకి పునాది వేసిన గొప్ప నటులలో ఈయన 679 ఒకరు అని చెప్పాలి. ఇక నేడు మన మధ్య లేకపోయినా ఆయన చిత్రాలు.. ఆయన వారసులు.. ఆయన పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)తన నటనతో తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈయన వారసులిగా వచ్చిన నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil) మాత్రం సక్సెస్ కోసం తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.
సమంతతో విడాకులు..
తాత, తండ్రి పరంపరను కొనసాగిస్తారని అభిమానులు కోరుకుంటున్నా.. ఆ కలలు మాత్రం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాతో ఈ కోరిక నెరవేరబోతోంది అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య అటు కెరియర్ పరంగా, ఇటు వ్యక్తిగతంగా కూడా సక్సెస్ అందుకోవడం లేదనే వార్తలు నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవానికి నాగచైతన్య సమంత (Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.
శోభిత తో ఎఫైర్..
అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట, అనూహ్యంగా విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు. ముఖ్యంగా సమంతను ఎంతోమంది విమర్శించారు కూడా. అదే సమయంలో సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే మరోవైపు నాగచైతన్య విడాకులు ప్రకటించిన మరుసటి ఏడాది ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) తో మొదలుపెట్టినట్లు వార్తలు వినిపించాయి. అంతే కాదు లండన్ లో ఒక హోటల్ నుంచి ఫోటో బయటకి రాగా.. ఆ ఫోటోలో కూడా శోభిత కనిపించింది. దీంతో రూమర్స్ కాస్త ఊపందుకున్నాయి.
ఎంగేజ్మెంట్ తో కన్ఫామ్..
మరోవైపు వెకేషన్స్ కి కూడా వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. కానీ క్లారిటీ లేదు. కానీ ఎట్టకేలకు ఆగస్టు 8 వ తేదీన నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, అందరికీ క్లారిటీ ఇచ్చారు. అయితే డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో భారీగా సెట్ వేసి వీరి వివాహం జరిపించబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీరి పెళ్లికి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అయింది. కానీ దీనిపై అక్కినేని ఫ్యామిలీ స్పందించలేదు.
పెళ్లిపై నాగార్జున కీలక వ్యాఖ్యలు..
కానీ తాజాగా గోవాలో జరిగిన IFFI 2024 అవార్డ్స్ వేడుకలలో, కాబోయే భార్య శోభిత దూళిపాళతో పాటు అమల, నాగార్జున లతో కలిసి సందడి చేశారు నాగచైతన్య. ఈ సందర్భంగా నాగార్జున.. శోభిత – నాగచైతన్య పెళ్లిపై క్లారిటీ ఇచ్చి, అందరిని ఆశ్చర్యపరిచారు. “డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో కేవలం 400 మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగబోతోంది. సింపుల్గా వివాహం చేసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ ఏర్పాట్లను కూడా వారికే వదిలేసాను” అంటూ నాగార్జున తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.