Reliance Humanoid Robot: ఫ్యాషన్, రిటైల్, ఎనర్జీ, టెక్నాలజీ.. ఇలా ఇందుకలదు అందు లేదు అన్నట్టుగా రిలయన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి హ్యూమనాయిడ్ రోబోలపై ఫోకస్ చేసింది. వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి రానున్నాయి. ఇంతకీ ఈ రోబోలు(Robot) ఎలా ఉండబోతున్నాయి? ఏం చేయబోతున్నాయి?
ఎలాన్ మస్క్.. ఇప్పటికే హ్యూమనాయిడ్ రోబోస్ విషయంలో చాలా ముందున్నారు. ఇప్పటికే సెకండ్ జనరేషన్ ఆప్టిమస్‌ను కూడా లాంచ్ చేశారు. ఇప్పటికే ఇవి సేవలు కూడా అందిస్తున్నాయి. చాలా మంది సెలబ్రెటీలు ఈ రోబోలను ఇంట్లో సేవలకు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడీ సక్సెస్ చూసే రిలయన్స్ కూడా ఈ రంగంలోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తోంది. పూర్తిగా ఇదే కారణమా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ఈ రంగం అంత త్వరగా ఎదిగే చాన్స్ కనపడటం లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా రోబోటిక్స్ స్టార్టప్ యాడ్వర్బ్ ఓ అనౌన్స్‌మెంట్ చేసింది. 2025లో తాము ఇండియాలో హ్యూమనాయిడ్ రోబోస్‌ను(Reliance Humanoid Robot) లాంచ్ చేయబోతున్నామని. యాడ్వర్బ్ అనౌన్స్ చేస్తే రిలయన్స్‌కు ఏంటి లింక్ అనుకుంటున్నారా? కానీ ఉంది. యాడ్వర్బ్ ప్రస్తుతం రిలయన్స్‌తో కలిసి పనిచేస్తోంది. అందుకే ఇప్పుడు మార్కెట్‌లో రిలయన్స్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
రిలయన్స్ ఏ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసినా.. ఘనంగా చేస్తోంది. అందుకే ఇప్పుడు రిలయన్స్ తీసుకొచ్చే రోబోలు ఎలా ఉండబోతున్నాయి? ఏయే పనులు చేస్తాయి? ఈ రోబోల రాకతో వచ్చే మార్పులేంటి? అనే విషయాలపై ఇప్పటికే చర్చ మొదలైంది.
రిలయన్స్ రోబోలు అత్యాధునిక టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్నాయి. అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విజన్, ఆడియో, టచ్ ఇన్‌పుట్స్ నుంచి మల్టీ మోడల్ డేటాను ఈజీగా ప్రాసెస్ చేసేలా వీటిని డిజైన్ చేయబోతున్నారు. అంతేకాదు సెల్ఫ్ లెర్నింగ్ అల్గారిథమ్స్, రియల్ టైమ్ డెసిషన్స్ తీసుకునేలా డెవలప్ చేయబోతున్నారు. వీటిని వేర్‌హౌస్, డిఫెన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉపయోగించబోతున్నారు.
Also Read: విమాన రంగం, సరికొత్త మైలురాయి.. ఒక్కరోజులో ఐదు లక్షల మంది
డల్, డర్టీ, డేంజరస్.. ఈ మూడింటిని సునాసయంగా చేసేలా ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఉండబోతున్నాయి. మనుషులలాగానే స్పందించడం.. ఆలోచించడం.. అంతే ఖచ్చితంగా చేయడం వీటి స్పెషాలిటీగా ఉండబోతున్నాయని యాడ్బర్బ్ చెబుతోంది. అంతేకాదు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇవి పనిచేయడమే కాదు.. లెటెస్ట్ GPU టెన్నాలజీ.. ఎనర్జీ ఎఫిషియేంట్ యాక్యుయేటర్స్ కూడా ఉండబోతున్నాయి.
అయితే తాము వరల్డ్ క్లాస్ రోబోలను తయారు చేయడమే కాదు.. చాలా వరకు ఇండిస్ట్రియల్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తాయని చెబుతున్నారు. దీని కోసం రిలయన్స్ AI ప్లాట్‌ఫామ్స్, 5జీ సర్వీస్‌లను ఉపయోగించుకోనుంది యాడ్వర్బ్. యాడ్వర్బ్ సంస్థ స్మార్ట్ ఎండ్ టు ఎండ్ రోబోట్స్‌ను రూపొందిస్తోంది. ఇవి ఇప్పటికే వేర్ హౌస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్రాసెస్‌లో తమ సేవలందిస్తున్నాయి.
పార్సిల్ హ్యాండ్లింగ్, క్వాలిటీ ఇన్‌స్పెక్షన్, సార్టింగ్, అసెంబ్లీ, డిజాస్టర్ రిలీఫ్ .. ఇలా అనేక రంగాల్లో తమ సేవలందిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీకి 350 క్లయింట్స్ కూడా ఉన్నారు. ఇందులో ఫ్లీప్‌కార్డ్, ITCతో పాటు అనేక ఫార్మా కంపెనీలు, పరిశ్రమలు కూడా ఉన్నాయి. అలాంటి కంపెనీ ఇప్పుడు రిలయన్స్‌తో కలిసి హ్యుమానాయిడ్ రోబోలను(Humanoid Robot) డెవలప్ చేయడం ఇప్పుడో గేమ్ చేంజర్ అనే చెప్పాలి. అయితే ఈ రోబోలపై రిలయన్స్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? మస్క్‌కు కాంపిటిషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోందా? అసలు ముఖేష్ అంబానీ(Mukesh Ambani)స్కెచ్ ఏంటి?