BigTV English
Advertisement

Nagarjuna: నాగార్జుననే బురిడీ కొట్టించిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్.. వీళ్ళు మామూలు ముదుర్లు కాదయ్యో!

Nagarjuna: నాగార్జుననే బురిడీ కొట్టించిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్.. వీళ్ళు మామూలు ముదుర్లు కాదయ్యో!

Nagarjuna..అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chutti Pickles).. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పేరు తెలియని జనాలు ఉండరు. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పచ్చళ్ళ బిజినెస్ తో చాలా ఫేమస్ అయిపోయారు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు. ఇక వీరి బిజినెస్ ఎంతలా అంటే.. ఒక టైం లో సోషల్ మీడియాలో ఫేమస్ ఎవరంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అని, ప్రతి ఇంట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఉండాలి అనేలా క్రేజ్ పెరిగిపోయింది. కానీ అలేఖ్య చిట్టి చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా సడన్ గా పచ్చళ్ళ బిజినెస్ కాస్త మూత పడిపోయింది. కస్టమర్ ని బూతులు తిట్టడం, అలా బూతులు తిట్టినా ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. ఇలా ఎన్నో జరిగిపోయాయి. అలా పూర్తిగా పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్లు నాగార్జున(Nagarjuna)ని కూడా బురిడీ కొట్టించారు అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియో క్రియేట్ చేసింది కాదు స్వయంగా నాగార్జుననే కుబేర మూవీ ప్రమోషన్స్ లో బయటపెట్టిన నిజం. మరి ఇంతకీ నాగార్జునని కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్లు ఎలా మోసం చేశారు?అనేది ఇప్పుడు చూద్దాం..


అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ చేతిలో మోసపోయిన నాగ్..

తాజాగా విడుదలైన కుబేర మూవీ(Kubera Movie) పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ధనుష్ (Dhanush), నాగార్జున, రష్మిక మందన్నా (Rashmika Mandanna), శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఇలా ప్రతి ఒక్కరు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అలా నాగార్జున శేఖర్ కమ్ముల ఇద్దరినీ నాగచైతన్య కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా నాగచైతన్య (Naga Chaitanya).. తన తండ్రిని రీసెంట్ గా మీరు మోసపోయిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండని కోరగా.. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ప్రస్తావించకుండా నాగార్జున ఇన్ డైరెక్ట్ గా ఈ పికెల్స్ బిజినెస్ వాళ్లపై స్పందించారు.


అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ మోసం బట్టబయలు..

మీరు రీసెంట్గా రిగ్రెట్ గా ఫీలైన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండని చైతూ అడగగా.. ఈ మధ్యన అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో..సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఇన్సిడెంట్..
ఇది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ అది ఇంటికి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోతుంది. అసిస్టెంట్ శ్రీను(Srinu)కి అది తినాలనిపిస్తుందని చెప్పి తెప్పించాను. శ్రీను తో పాటూ నేను కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను తినాలని.కానీ తీరా వచ్చాక వాళ్ళు చూపించిన దానికి ఇంటికి వచ్చిందానికి అస్సలు సంబంధం లేదు. అంటూ చైతన్య అడిగిన ప్రశ్నకి నాగార్జున ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.

నాగార్జున అన్నది అలేఖ్య సిస్టర్స్ నేనా..?

అయితే నాగార్జున చెప్పిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. ఓ నెటిజన్ ఈ వీడియో ను అలేఖ్య సిస్టర్స్ తో క్రియేట్ చేశారు. ఇందులో నాగార్జున మాట్లాడిన వీడియో కింద.. అలేఖ్య చిట్టి పికిల్స్ లోని ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటో, పికిల్స్ బిజినెస్ ఫోటో పెట్టి నాగార్జున కూడా ఆన్లైన్లో మోసపోయారు అంటూ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే ఇది ఒక నెటిజన్ క్రియేట్ చేసిందే తప్ప నాగార్జున స్వయంగా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ప్రస్తావించలేదు. వాస్తవానికి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి నాగార్జున పికిల్స్ అన్నారు కాబట్టి ఆ పికిల్స్ లో ఎన్నో రకాల పికిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా పాపులర్ అయిన నేపథ్యంలోనే సదరు నెటిజన్ ఇలా వీడియో చేశారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్, నాగార్జున కే తెలియాలి.

?igsh=MXB4YjE3eTZ4M2U5NQ%3D%3D

ALSO READ: Sandeep Reddy Vanga: ఖరీదైన కారు కొన్న స్పిరిట్ డైరెక్టర్.. ఖరీదు, ఫీచర్స్ తెలిస్తే షాక్..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×