Sandeep Reddy Vanga:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు హిందీనాట సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ముఖ్యంగా తన కార్ గ్యారేజీలోకి గ్రీన్ కలర్ మినీ కూపర్ కారును తీసుకొచ్చారు. ఈ కారు మోడల్..”కూపర్ S..JSW” అయి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ మోడల్ ధర సుమారుగా రూ.50 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. ఇకపోతే తాజాగా సందీప్ రెడ్డివంగా ఈ కారుకి పూజలు చేయించి, బయటకు తీస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సందీప్ రెడ్డి వంగాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సందీప్ కొన్న కొత్త కార్ ఫీచర్స్ ఇవే..
ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తాజాగా కొనుగోలు చేసిన ఈ మినీ కూపర్ S..JSW గ్రీన్ కలర్ లో చాలా అందంగా ఆకట్టుకుంటోంది. ఇది బయటకి కనిపించడానికి అందంగా ఉండటమే కాదు దీని ఫీచర్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. మినీ కూపర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. కాంపాక్ట్ సైజు, గో -కార్ట్ లాంటి హ్యాండ్లింగ్ తో ప్రత్యేకమైన డిజైన్ కి ప్రసిద్ధి చెందింది. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ పవర్ శ్రేణిలలో అందుబాటులో ఉంది. అంతేకాదు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలతో పాటు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ స్టైలింగ్ లుక్ తో అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ కారు స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ తో పాటు అనేక రకాల సాంకేతిక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటుంది. భద్రత విషయానికి వస్తే.. ఈ కారులో ఈబీడీతో కూడిన ఏవీఎస్, ఆరు ఎయిర్ బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ మెంట్, టైర్ ప్రెజర్, మానిటరింగ్ సిస్టం వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ కార్లో ప్రతి ఫీచర్ కూడా వినియోగదారుడుని ఖచ్చితంగా అబ్బురపరుస్తుంది.
సందీప్ రెడ్డి వంగ సినిమాలు..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా చేసి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘ యానిమల్’ సినిమా చేసి సంచలనం సృష్టించిన ఈయన
. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనే (Deepika Padukone) ను హీరోయిన్ గా ఎంపిక చేసుకుని, ఆ తర్వాత పలు కారణాలవల్ల ఆమెను పక్కనపెట్టారు. ఇప్పుడు రంగంలోకి యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti dimri) వచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ:Kuberaa film: ఇంత గొప్ప కథను అందించిన పింగళి చైతన్య ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Director #SandeepReddyVanga Bought New car MiniCooper pic.twitter.com/fdvjNoPtPV
— Filmy Bowl (@FilmyBowl) June 19, 2025