Nani on Allari Naresh : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ యాక్టర్ లలో నాని ఒకరు. ప్రస్తుతం నాని సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అంశం ఉంటుంది అని ప్రేక్షకులు ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్ళిపోయే స్థాయికి వచ్చేసారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన నాని తర్వాత నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకొని హీరోగా కూడా నిలబడ్డాడు. నాని కెరియర్ విషయానికి వస్తే జెర్సీ సినిమా తర్వాత నాని కథలను ఎంచుకునే విధానం పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. గౌతమ్ దర్శకత్వం వహించిన జెర్సీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ సాధించడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమాలో అర్జున్ అనే పాత్రలో నాని ఒదిగిపోయిన విధానం ఇప్పటికి ఎవరూ మరిచిపోలేరు.
అయితే నాని కొన్ని అంశాలపై మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పుని తప్పు అని చెప్పడం నానికి అలవాటు. ఇకపోతే నాని తన తోటి హీరోలతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నాని రీసెంట్ టైమ్స్ లో కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా తనతో పని చేసిన దర్శకులకి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసి కూడా మంచి మార్కులు పొందుకున్నాడు నాని. అయితే అల్లరి నరేష్ తో నానికి మంచి పరిచయం ఉంది వీరిద్దరూ కలిసి ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అయితే నాని నరేష్ తో కలిసి సినిమా చేస్తే అది పంచతంత్రం సినిమాలా ఉండాలి అని అనుకుంటున్నట్లు రీసెంట్ గా జరుగుతున్న బచ్చలమల్లి ట్రైలర్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
నాని విషయానికి వస్తే అక్కినేని నాగార్జున తో పాటు దేవదాస్ అనే సినిమాలో మల్టీ స్టారర్ చేశాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇక ప్రస్తుతం నాని ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో సెక్స్ వర్కర్ గురించి రెడ్ లైట్ ఏరియాస్ గురించి శ్రీకాంత్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి చిన్న పిల్లలకు నో ఎంట్రీ అని గతంలో ఒకసారి నాని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే ఇదివరకే చాలామంది హీరోలతో కలిసి నటించాడు.ఇప్పుడు నానితో కలిసిన నటిస్తే అది ఖచ్చితంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొస్తుంది అని చెప్పాలి.
Also Read : Allu Arjun Speech after Release : ఇదో ఛాలెంజింగ్ సిట్యుయేషన్… పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తా..