Allu Arjun Speech after Release : పుష్ప 2 (Pushpa 2) సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ 4వ తారీఖు రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ పుష్ప సినిమా చూడడానికి తన ఫ్యామిలీతో పాటు వచ్చారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో రేవతి అనే ఒక మహిళ మృతి చెందారు. తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై చిత్ర యూనిట్ కూడా ఇదివరకే స్పందించింది. అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా నిలుస్తాను అని హామీ ఇచ్చారు. ఒక పాతిక లక్షల వరకు ఆ కుటుంబానికి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మెడికల్ ఖర్చులు కూడా భరిస్తూ వాళ్లకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తామని ఇది వారికి చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
ఇక ఈ కేసు గురించి అంతా కూల్ అయిపోయింది అనుకునే తరుణంలో కేసు మరో మలుపు తిరిగింది. అల్లు అర్జున్ కొంతమంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు జరిపించి చంచల్గూడా జైలుకు అల్లు అర్జున్ తరలించారు. 14 రోజులపాటు అల్లు అర్జున్ (Allu Arjun) జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈలోపే అల్లు అర్జున్ కు మద్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వచ్చేస్తాడు అని చాలామంది ఊహించారు. కానీ కొన్ని కారణాల వలన నిన్న రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వచ్చింది. రాత్రంతా సాధారణ ఖైదీ లా జైల్లోనే గడిపాడు బన్నీ. ఇక నేడు ఉదయం 6 గంటలకు చంచల్గూడా జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చారు.
Also Read : Niranjan Reddy : ఇంత తెలివైన వారు, ఆ ఆచార్య సినిమా ఎలా ప్రొడ్యూస్ చేశారు.?
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపటి క్రితమే తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. “మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్యూ. తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతిచెందడం బాధాకరం. దానికి చింతిస్తున్నారు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఒక 30 సార్లు ఆ థియేటర్ కి వెళ్లి ఉంటాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొనలేదు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తా” అని తెలిపారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని సినీనటుడు అల్లు అర్జున్ వెల్లడించారు. తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. తాను బాగున్నానని, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసు కోర్టులో ఉందని, తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని పేర్కొన్నారు.
Also read : RGV: దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా.. అంటే ఏంటి వర్మ.. అల్లు అర్జున్ దేవుడని అంటున్నావా..?