Nassar:సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో, హీరోయిన్లను.. ప్రేక్షకులు వారి సినిమాలు చూసి, వారి నటనను మెచ్చిన తర్వాతనే అభిమానులుగా మారిపోతారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో, హీరోయిన్లు అంటూ ఉంటారు. అయితే సామాన్య జనాలకే కాదు సినిమాలు చేసే సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ సెలబ్రిటీలు వుంటారు. అలా ఓ నటుడి కొడుకు 14 రోజులు కోమాలో ఉండి తిరిగి బ్రతికాడంటే కారణం ఓ హీరో నట. ఆ హీరో వల్లే తన కొడుకు కోమా నుండి బయటపడ్డారని, ఆ నటుడు చెప్పుకొని ఎంతగానో సంబరపడిపోయారు. ఇక ఆయన ఎవరో కాదు నాజర్.
కోమలోకి జారుకున్న నాజర్ కొడుకు..
ఇక నాజర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే..నాజర్ కి ముగ్గురు కొడుకులు.. మొదట పెద్దకొడుకు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి.కానీ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక కోమలోకి కూడా వెళ్లారు. ఆ కోమా నుండి ప్రస్తుతం కోలుకున్నప్పటికీ తన కొడుకు కోమా నుండి బయటపడడానికి ఆ హీరో కారణమయ్యారు అంటూ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో నాజర్ చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.మరి ఇంతకీ నాజర్ కొడుకు కోమా నుండి బయటపడడానికి ఏ హీరో కారణం అయ్యారంటే తమిళ నటుడు విజయ్ దళపతి(విvijay Thalapathi). చాలామంది సెలెబ్రిటీల పిల్లలకు కూడా వేరే హీరోలంటే ఇష్టం ఉంటుంది.అలా నాజర్ కొడుకుకి విజయ్ దళపతి అంటే చెప్పలేనంత ఇష్టమట.
విజయ్ వల్లే నా కొడుకు మామూలు మనిషయ్యాడు..
అయితే ఈ విషయాన్ని నాజర్ చెబుతూ.. నా కొడుకు 14 రోజులు కోమాలో ఉన్న సమయంలో మేం ఎంతగానో కృంగిపోయాం. నా కొడుకు కోమా నుండి బయటపడి స్పృహలోకి వచ్చాక మొదట తలచిన పేరు విజయ్. అయితే విజయ్ అనేది నా కొడుకు ఫ్రెండ్ పేరు. అందుకే వాడి పేరే తలుస్తున్నాడని మేము అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ అబ్బాయిని చూపిస్తే గుర్తుపట్టలేదు. కానీ హీరో విజయ్ ఫోటో చూపిస్తే మాత్రం గుర్తుపట్టాడు. అలా వాడిలో కదలికలు మొదలయ్యాయి అని డాక్టర్లు విజయ్ దళపతికి సంబంధించిన సినిమాలు, పాటలు చూపించారు.అలా చూపించడంతో వాడి పరిస్థితి మరింత కుదటపడడం గమనించారు. అలా ఈ విషయం తెలుసుకున్న విజయ్ నా కొడుకుని హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్ళాడు.ఇక మొదటిసారి విజయ్ వచ్చిన సమయంలో నా కొడుకు మొహంలో ఏదో తెలియని ఆనందం. అలా ఒక్కసారి కాదు విజయ్ చాలాసార్లు మా అబ్బాయి దగ్గరికి వస్తూ కలిసి వెళుతూ ఉండేవారు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా పెరిగింది. అంతేకాదు విజయ్ మా అబ్బాయికి ఇష్టమైన గిటార్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అది చూసి మా అబ్బాయి చాలా సంతోషించాడు. అలా మా జీవితాల్లో విజయ్ దళపతి వెలుగులు నింపాడు. విజయ్ దళపతి మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మా జీవితంలో విజయ్ కి ప్రత్యేక స్థానం కూడా ఉంది” అంటూ నాజర్ విజయ్ ను పొగుడుతూ గొప్పగా చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు. అలా ఒక అభిమాని కోసం విజయ్ దళపతి చేసిన పని చూసి చాలామంది ఆయన అభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు.