E-Paper
Advertisement

Samantha: ఆ పరిస్థితులను మర్చిపోకు.. ధైర్యంతో ముందుకు సాగిపో: సమంత

Samantha: ఆ పరిస్థితులను మర్చిపోకు.. ధైర్యంతో ముందుకు సాగిపో: సమంత

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలపైనే ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. వరుస సినిమాలతో ఫుట్ బిజీగా ఉన్న సమయంలో మయోసైటిస్ భారిన పడడంతో కెరీర్ మధ్యలో కాస్త బ్రేక్ వచ్చింది. దాదాపు ఎనిమిది నెలల పాటు ఆ వ్యాధితో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తిరిగి సినిమాలపై ఫోకస్ పెడుతోంది.

ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతల’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘సిటాడెల్’ అనే సినిమాలో కూడా సామ్ నటిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్.. అటు ‘శాకుంతల’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.. సమంత.

తాజాగా జనవరి నెలలో తన లైఫ్ ఎలా గడిచిందో తెలియజేస్తూ.. వర్క్‌లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సామ్ షేర్ చేసింది. ‘‘ఊపిరి పీల్చుకో పాప. గడిచిన ఎనిమిది నెలలు అత్యంత క్లిష్ట పరిస్థితులను చూస్తూ ముందుకు సాగావు. ఆ పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోకు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. ఆలోచించలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగావు. నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. అలాగే ధైర్యంతో ముందుకు సాగిపో’’ అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×