Sumanth: చాలామంది ఏఎన్ఆర్ మనవడు సుమంత్ ని అక్కినేని సుమంత్ అనుకుంటారు. కానీ ఈయన ఇంటిపేరు యార్లగడ్డ సుమంత్..కానీ ఎప్పుడైతే అక్కినేని నాగేశ్వరరావు సుమంత్ ని దత్తత తీసుకున్నారో అప్పటినుండి అక్కినేని సుమంత్ గా మారిపోయారు. అయితే అలాంటి సుమంత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత అనగనగా అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఈటీవీ విన్ అనే ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ అవుతుంది. సుమంత్ మెయిన్ లీడ్ చేసిన అనగనగా మూవీకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఆహా ఓటీటిలో ప్రసారమయ్యే కాకమ్మ కథలు అనే షోలో శ్రీనివాస్ అవసరాల, సుమంత్ ఇద్దరు పాల్గొన్నారు. ఈ షోకి తేజస్వి మదివాడ యాంకరింగ్ చేస్తుంది.
రోబోలా ఉన్నావ్ అన్నారు – సుమంత్
అలా షోలోకి రాగానే యాంకర్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నారు రహస్యం ఏంటి అంటూ సైగలు చేసుకుంటూ మాట్లాడేసరికి ఏంటండీ నేనేదో ఇంజక్షన్లు వేసుకుని ఇలా ఉంటున్నట్టు మాట్లాడుతున్నారు అని నవ్వారు సుమంత్. ఆ తర్వాత శ్రీనివాస్ అవసరాలతో తనకున్న బాండింగ్ బయట పెట్టింది తేజస్వి.. నేను మీతో కలిసి బాబు బాగా బిజీ సినిమా చేశానని గుర్తు చేసుకుంటుంది. అలాగే అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చి దేనికి రియాక్ట్ అవ్వవు అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా అని తేజస్వి అడగగా.. సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఫీల్, ఎమోషనల్, ఏదైనా ఎక్స్ ప్రెస్ చెయ్యు అలా రోబోట్ లా ఉంటావు ఎందుకు అని నన్ను చాలామంది అమ్మాయిలు అన్నారంటూ సుమంత్ చెప్పుకొచ్చారు.అలాగే తనది బుద్ధిస్ట్ ఫిలాసఫీ అని అదే ఫాలో అవుతానని చెప్పుకొచ్చారు.
హీరో కాకపోయుంటే అలా పని చేసేవాడిని – సుమంత్
ఇక శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లో లాస్ట్ నేమ్ కొడితే వారి ఫోన్ నెంబర్లు వచ్చేవి.
అలా నేను అన్నపూర్ణ స్టూడియోస్ ఫోన్ నెంబర్ ని చాలాసార్లు ట్రై చేశా అని చెప్పారు.దానికి సుమంత్ మాట్లాడుతూ.. ఆయన ఫోన్ చేస్తే తాతగారో మావయ్యనో లిఫ్ట్ చేస్తారని ఊహించుకొని ఉంటారు పాపం అన్నట్లుగా మాట్లాడారు. ఇక మీరు సినిమాల్లోకి రాకపోతే ఏం పని చేసేవారు అని యాంకర్ తేజస్వి సుమంత్ ని అడగగా.. నేను సినిమాలు చేయకపోతే స్టూడియోలో ఏదో ఒక పని చేసే వాడిని. మేనేజర్ గా వర్క్ చేసేవాడని..శ్రీనివాస్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసే వాడిని అంటూ నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్, నాగార్జున వీరిద్దరిలో ఎవరితో డాన్స్ చేస్తారు ఎవరితో డ్రింక్ చేస్తారు అని యాంకర్ అడగగా.. వెంకీ బాబాయ్ తో డ్యాన్స్ మామయ్యతో డ్రింక్ చేస్తానని సుమంత్ చెప్పారు.ప్రస్తుతం కాకమ్మ కథలు షోకి సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.మరి ఇంకా ఈ షోలో ఏమేం మాట్లాడుకున్నారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.