Keeravani: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. చిత్రానికి ఆస్కార్ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా అసుర హననం అనే పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కీరవాణి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం..
పవన్ కళ్యాణ్‌పై కీరవాణి కామెంట్స్..
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదలై ఐదు సంవత్సరాలు అవుతుంది. ఇటీవల ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఎం ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణకు బాధ్యతలు అప్పగించి, క్రిష్ తప్పుకున్నాడు ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. అందులో భాగంగా మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా అసుర హననం పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మీరంతా ప్రేమగా పిలుచుకుంటారు. కానీ నేను ఆయన గురించి చెప్పమంటే మూర్తిభవించిన ధర్మ ఆగ్రహం. అంటే ఆగ్రహం అందరికీ వస్తుంది కానీ ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్ కి మాత్రమే వస్తుంది. మనం ఎవరు తిట్టినా కోప్పడతాం. ఎవరు ఏమన్నా వెంటనే ఆగ్రహం వస్తుంది. ధర్మగ్రహం అంటే ప్రజల కోసం న్యాయం కోసం వస్తుంది అది ఆయనకి మాత్రమే ఆయనకి సరిపోయే మాట ఇది. ఈ మూవీ ఆయన కోసం మాత్రమే తీయబడినది. ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ కోసం మూవీ చేస్తున్నాను. నాలాంటి వారికి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది. ఆయనకు ఆలా కాదు. అయన జయ అపజయాలతో సంబంధం లేకుండా, అంటే రిజల్ట్ ఎలా అయినా ఉండనివ్వండి ఆయన మాత్రం దూసుకుపోయే కారు చిచ్చే పవన్ . కారు చిచ్చు అంటే ఆగదు దూసుకుపోతూనే ఉంటుంది అలానే పవన్ కళ్యాణ్ దూసుకుపోవడమే కానీ ఆగేది ఉండదు. అని కీరవాణి తెలిపారు.
వారానికో సప్రైజ్ ప్లాన్ లో మూవీ టీమ్ ..
ఇక కీరవాణి సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం స్టార్ట్ చేయడం ఏమేం రత్నం గారికి మంచి ఆదాయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాము. అసుర హననం సినిమాలో మూడవ పాట ఇంకా మూడు పాటలు ఉన్నాయి. ఇంకో బిట్ సాంగ్ ఉంది. దాని తర్వాత ట్రైలర్ ఉంటుంది. ఈ మూడు పాటలు, ట్రైలర్, బిట్ సాంగ్, అన్నీ కలిపి జూన్ 12న ఎలా రిలీజ్ చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకోబోతున్నాం. అది మా అందరి మీద ఉన్న బాధ్యత. ఈ ఉన్న 20 రోజుల్లో మంచిగా ప్లాన్ చేసి వారానికి ఒక సర్ప్రైజ్ మీ ముందుకు తీసుకురానున్నాం. పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ ఏం చేస్తున్న సినిమా మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ జూన్ 12 తారీకు కోసం మీతో పాటు నేను ఎదురు చూస్తున్నాను అని కీరవాణి తెలిపారు.