E-Paper
Advertisement

Actor Sunil : మరీ అంత తగ్గడం అవసరమా? స్టార్ కమెడియన్ పై నెటిజన్స్ ఆవేదన..

Actor Sunil : మరీ అంత తగ్గడం అవసరమా? స్టార్ కమెడియన్ పై నెటిజన్స్ ఆవేదన..
Advertisement

Actor Sunil : కమెడియన్ గా మంచి కామెడీ తో జనాలను బాగా అట్రాక్ట్ చేసుకుని క్రమంగా హీరోగా ఎదిగిన నటుడు సునీల్. సునీల్ లో విలనిజం కూడా ఉంది అన్న విషయం అతని విలక్షణమైన విలన్ పాత్రలతో రీసెంట్ గా ప్రేక్షకులకు అర్థమైంది. పుష్పలో మంగళం శీను అదరగొట్టిన సునిల్ క్రమంగా తమిళ్లో మంచి ఆదరణ అందుకుంటున్నాడు. రీసెంట్ గా తమిళ్ లో వచ్చిన చాలా చిత్రాలలో సునీల్ విలన్ గా మెప్పిస్తున్నాడు.

తెలుగులో సునీల్ కి మూవీస్ కి కొదవ ఏమీ లేదు.. తన స్టైల్ కామెడీతో మంచి కమెడియన్ గానే కాకుండా సాలిడ్ సపోర్ట్ క్యారెక్టర్స్ లో కూడా సునీల్ బాగా ఫేమస్. కానీ సునీల్ ఎందుకో గత కొద్దిరోజులుగా తమిళ్ ఇండస్ట్రీపై మనసు పారేసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం సునీల్, కార్తి హీరోగా వస్తున్న జపాన్ చిత్రంలో కూడా నటించాడు. కెరియర్ పరంగా అభివృద్ధి చెందడం ..అది కూడా వేరే ఇండస్ట్రీకి వెళ్లి అంటే అభినందించదగ్గ విషయమే.. కానీ సునీల్ తమిళ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో మాట్లాడే తీరు పై కొందరు విమర్శిస్తున్నారు.

Advertisement

ప్రమోషన్స్ స్పీచ్ లో సునీల్ సరికొత్తగా ఇండస్ట్రీకి వచ్చినట్టు బిహేవ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగులో కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టి స్టార్ డమ్ తెచ్చుకొని హీరోగా పలు చిత్రాలు చేసిన నటుడు. తమిళ్ లో పెద్దగా తెలియకపోవచ్చు కానీ తెలుగులో అతనికంటూ ఒక మంచి గుర్తింపు ఉంది కదా. మరి అది పక్కన పెట్టి ఆఫర్ల గురించి చెబుతూ.. ఇప్పుడే ఓనమాలు దిద్దిన నటుడిలా మాట్లాడడం కొందరికి అభ్యంతరకరంగా ఉంది.

పరాయి భాషలో రాణించాలి అంటే కచ్చితంగా మూవీ మేకర్ సపోర్ట్ ఉండాలి. కానీ తనని తాను తగ్గించుకోవడానికి సునీల్ మరి అంత చిన్నవాడు కూడా కాదు కదా. తెలుగులో కూడా బాగా రాణిస్తున్న సమయంలో తమిళ్ ఆఫర్ల పై సునీల్ ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కావడం. హైదరాబాద్ ఇల్లు అయితే.. చెన్నై ఏకంగా టెంపుల్ అట.. ఇలా మాట్లాడడం ఒకరకంగా తెలుగు ఫాన్స్ ని నిరాశకు గురిచేస్తుంది.

Advertisement

ఇప్పటికైనా సునీల్ తాను తెలుగులో ఒక స్టార్ కమెడియన్ ని అన్న విషయం గుర్తు పెట్టుకొని మాట్లాడితే బెటర్ గా ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఇక తమిళ్ లోనే కాకుండా ప్రెసెంట్ కిచ్చా సందీప్ కన్నడ మూవీ మ్యాక్స్ లో కూడా సునీల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. కొత్త కొత్త పాత్రలతో విభిన్న భాషలలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అనుకోవడం ..కెరియర్ గ్రాఫ్ ని పెంచుకోవడానికి ప్రయత్నించడం తప్పు కాదు.. తమిళ్ ఆఫర్ల గురించి మాట్లాడుతున్న తీరు మాత్రం కరెక్ట్ కాదు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుతం సునీల్ పుష్ప 2 తో పాటు మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో కూడా ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాక అరడజన్ పైగా తెలుగు సినిమాలు సునీల్ చేతిలో ఉన్నాయి. ఇది కాక పక్క రాష్ట్రాల్లో చేస్తున్న సినిమాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునిల్ తన రెమ్యూనరేషన్ ని కూడా బాగా పెంచినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×