BigTV English

Suresh : హీరోయిన్ తో లవ్, ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన సురేష్..!

Suresh : హీరోయిన్ తో లవ్, ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన సురేష్..!

Suresh : ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వాళ్ళు వరుస సినిమాలు చేస్తూ తమ టాలెంట్ తో హీరోగా అవకాశాలు పొందిన చాలా మంది స్టార్స్ ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ నటులుగా బిజీ అవుతున్నారు. అందులో టాలీవుడ్ నటుడు సురేష్ కుడా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈయన పేరు తెలిసే ఉంటుంది. ఒక నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. తాజాగా ఈయన గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తల పై సురేష్ స్పందించారు. ఆయన ఎమన్నారో తెలుసుకుందాం..


నటుడు సురేష్ సినిమాలు.. 

తెలుగు ప్రేక్షకులకు సురేష్ పేరు సుపరచితమే.. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్‌ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ఇటీవల ఒక్క సినిమా లో కనిపించలేదు. గతంలో కొంతమంది స్టార్స్ కు డబ్బింగ్ చెప్పాడు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేఆయన తమిళం లో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెర పై సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు..


నటితో ఎఫైర్ పై క్లారిటీ.. 

సురేష్ సినిమాల్లో ఎక్కువగా విలన్ క్యారక్టర్ లో కనిపించి అందరి మనసు దోచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు అందులో ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన కెరీర్‌లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రం లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్‌గా ఉన్న నదియాతో సురేష్ లవ్‌లో ఉ‍న్నారని వార్తలు వినిపించాయి. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్‌ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్‌తోనే ఫోన్‌ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు.. ఆమె అతన్నే పెళ్లి చేసుకుంది. ఇప్పటికి ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటి ఇచ్చారు.

సురేష్ సినిమాల విషయానికొస్తే.. తెలుగు లో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్‌ అనే మూవీలో నటించారు.. ఇక ఆ తర్వాత హీరోల కు డబ్బింగ్ చెప్తున్నారు. ఇక ఈయన రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలుసు.. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు.. ఇప్పుడు వీరిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఇక మంచి క్యారెక్టర్ ఉన్న పాత్ర వస్తే సినిమాలు చేస్తానని ఆయన అన్నారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×