trinayani serial today Episode: అఖండ స్వామి చెప్పిన మాటలు గుర్తు చేస్తాడు వల్లభ. అద్దంలో ఎవరికేతే వేరే వాళ్ల ముఖం కనిపిస్తుందో వాళ్లలో ఆత్మ దూరినట్టు అని అఖండ స్వామి చెప్పారు అని వల్లభ అంటాడు. తాము అఖండ స్వామిని కలిసి మాట్లాడింది మొత్తం చెప్తారు. దీంతో చెల్లిలోకి ఆత్మ ప్రవేశించడం ఏంటి..? అంటూ హాసిని అనుమానపడుతుంది. ఎవరిది అని సుమన అడుగుతుంది. నయనిది అంటూ తిలొత్తమ్మ చెప్తుంది. ఏంటి అని హాసిని అడగ్గానే.. నమ్మాల్సిందే.. అని దేవీపురం వెళ్లినప్పుడు నయని కట్టుకున్న చీర ఈ అద్దంలో కనిపించేది ఒకటే చీర అంటుంది తిలొత్తమ్మ. అయితే అని నయని అడగ్గానే.. నడిపి కోడలు చనిపోయిందని అర్థం అంటుంది తిలొత్తమ్మ.. అత్తయ్యా నా కూతురు ముందు ఇలా మాట్లాడితే బాగుండదు రా గాయత్రి అంటూ పాపను తీసుకుని వెళ్తుంది నయని.
తిలొత్తమ్మ, వల్లభ మాట్లాడుకుంటుంటే.. సుమన వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారా..? అని అడుగుతుంది. మాకు గెస్ట్ హౌస్ ఉండి ఉంటే అక్కడికి వెళ్లే వాళ్లం అంటాడు వల్లభ. మేము అయోమయంలో పడితే మీరు ఆనందంగా పార్టీ చేసుకుంటారంటారేంటి..? అంటుంది సుమన. ఇంట్లో కాదు సుమన ఏకంగా ఒంట్లోనే ఆత్మ ఉందని ప్రూప్ చేశాం కదా అని తిలొత్తమ్మ చెప్పగానే.. అది అడుగుదామనే ఇక్కడికి వచ్చాను అత్తయ్యా మా అక్క ఆత్మ అద్దంలో కనిపించడం ఏంటి..? అని అడగ్గానే పెద్ద మరదలు హుష్ పటాక్ అంటాడు వల్లభ అంటే ఏంటి అంటుంది సుమన.
పెద్ద మరదలు ఎప్పుడో చనిపోయింది అంటాడు వల్లభ. ఇంతలో హాసిని వచ్చి నయని చెల్లి స్వర్గానికి వెళ్లి అక్కడి పరిస్తితులు చక్కబెట్టి వస్తుందట.. నీకు చెప్పడం మర్చిపోయాను మా ఆయన అత్తయ్య నరకాని వెళ్లారట వీళ్లు మనుషులు కాదు దెయ్యాలు అట అంటుంది హాసిని.. తిలొత్తమ్మ తిట్టగానే.. సారీ దెయ్యాలు అంటే కోపం వస్తుంది కదా..? సరే ఆత్మలు అంటుంది హాసిని. వల్లభ భయంగా మమ్మీ మనం చనిపోయామట అంటాడు. తిలొత్తమ్మ హాసినిని తిట్టగానే.. మ్యాజిక్ చేసే అద్దం తీసుకొచ్చి అందులో నయని వేరేలా కనిపించేలా చేసి మమ్మల్ని షాక్ కు గురి చేస్తారా..? అంటూ తిడుతూ వెళ్లిపోతుంది హాసిని.
హాల్లో కూర్చున్న రత్నాంభ కోపంగా తిలొత్తమ్మను తిడుతుంది. ఇంటికి పెద్ద అనిపించుకోవడం కాదు బుద్దిలోనూ అలాగే ఉండాలి అంటుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి ఎవరు బామ్మ గారు అని అడుగుతాడు. ఆ పేరు ఎత్తడానికి నాకు ఇష్టం లేదు అంటుంది ఎవరో చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అంటాడు. మీ అత్తనే ఆడిపోసుకుంటుంది విక్కి అని దురందర చెప్తుంది. ఓహో నిన్న అద్దంలో జరిగిన మ్యాజిక్ గురించి బామ్మ గారికి తెలిసినట్టు ఉంది అంటుంది సుమన.
గారెలు తినకుండా జరిగిన గారడీల గురించి గోల ఎందుకత్తా అంటాడు ముక్కోటి.. దీంతో కోపంగా నోరు మూసుకుని తిను వెధవ అంటూ తిడుతుంది. ఇంతలో తిలొత్తమ్మ వచ్చి సంపూర్ణంగా సత్యం తెలిస్తే ఇంకా ఇబ్బంది పడతారు బామ్మ గారు అంటుంది. వచ్చావా..? తల్లి నీ కోడలు బతికే ఉంటే ప్రాణమే లేదని అలా ఎలా అంటావు.. అంటూ తిట్టగానే ఆవేశపడకండి బామ్మ గారు మేము చెప్తే మీరు నమ్మరు కానీ అఖండ స్వాముల వారు చెబితే నమ్ముతారా..? అని అఖండ స్వామిని పిలుస్తారు.
ఇంతలో అఖండ స్వామి వస్తాడు. అఖండ స్వామి ఎందుక వచ్చారు అని నయని కోపంగా అడుగుతుంది. నువ్వు నయని కాదంటే వీళ్లు ఎవరూ నమ్మటం లేదని.. అందుకే స్వామిని తీసుకొచ్చామని తిలొత్తమ్మ చెప్తుంది. వల్లభ కోపంగా అఖండ స్వామిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?