Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 8న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి.
వృషభ రాశి : ఈ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ఈరోజు సఫలమవుతాయి. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు..
మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోస్తులకు పై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలలో స్థానచలన మార్పులు ఉన్నాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు.
మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
మీన రాశి : ఈ రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ALSO READ: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?