BigTV English

Satyadeep Misra Becomes Father: తండ్రి కాబోతున్న అదితి రావు హైదరి మాజీ భర్త సత్యదీప్!

Satyadeep Misra Becomes Father: తండ్రి కాబోతున్న అదితి రావు హైదరి మాజీ భర్త సత్యదీప్!

Masaba Gupta First pregnancy: సెలబ్రెటీలకు సంబంధించి ఎలాంటి వార్త అయినా తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వారి పెళ్లి, రిలేషన్ ఇలాంటి అప్డేట్‌లపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా నటి అదితి రావు హైదరి మాజీ భర్తకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చి అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేసింది. ఇంతకీ ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా?..


అదితి రావు హైదరి అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో సత్యదీప్ పేరు మాత్రం బాగా వినిపిస్తుంది. అయితే తాజాగా అతడు తండ్రి కాబోతున్నాడు. నటి అదితి రావు హైదరితో విడాకుల తర్వాత అతడు బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబాన గుప్తాను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు.


అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది. తాజాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆమె తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘రెండు చిన్న అడుగులు మా దగ్గరకు రాబోతున్నాయి.. బేబీ ఆన్‌బోర్డ్’’ అంటూ తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో తను, తన భర్తతో దిగిన ఫొటో వెనుక వైపున రెండు పాదాలు కనిపిస్తున్నాయి. ఈ గుడ్ న్యూస్‌తో బాలీవుడ్ నటీ నటులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

పరిణితి చోప్రా, బిపాస బసు, కరీనా కపూర్, శిల్పా శెట్టి, కరిష్మా కపూర్, అనన్య పాండే, కృతి సనన్, మలైకా ఆరోరా వంటి నటీమణులు ఆమె పోస్ట్‌కు కామెంట్స్ పెట్టారు. ఇదిలా ఉంటే నటి మసాబా గుప్తా ‘మసాబా మసాబా’ అనే వెబ్ సిరీస్‌ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ టైంలోనే అదితి రావు హైదరి మాజీ భర్త సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడింది.

Also Read: అదితితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌.. తొలిసారి స్పందించిన సిద్ధార్థ్‌

ఇక కొంత కాలం డేటింగ్ తర్వాత ఈ జంట గతేడాది 2023లో వివాహం చేసుకున్నారు. ఇకపోతే మసాబాకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను మ్యారేజ్ చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య అనివార్య కారణాల వల్ల మనస్పర్థాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

అలాగే సత్యదీప్- అదితి కూడా పెళ్లి చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత సత్యదీప్, మసాబాతో లవ్‌లో పడ్డాడు. అలాగే అదితి – హీరో సిద్దార్థ్ మధ్య కూడా ప్రేమ చిగురించింది. ఇటీవలే వీరిద్దరూ ఎంగెజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు.

Tags

Related News

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×