BigTV English

Nominations in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్లు.. నిన్న ఎవరెవరు వేశారంటే..?

Nominations in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్లు.. నిన్న ఎవరెవరు వేశారంటే..?

Candidates Nominations in Telugu States for Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల ప్రకియ ప్రారంభం కాగా.. నిన్న పలువురు కీలక నేతలు తాము పోటీ చేసే స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో నిన్న నామినేషన్లు వేసిన స్థానాల్లో మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నామినేషన్ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయి ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

balakrishna nomination
balakrishna nomination

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అంబర్ పేట మహంకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయిబాబా దర్శనం.. ఆ తరువాత నల్లకుంటలోని శంకర్ మఠ్‌లో స్వామివారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.


Also Read: YS Sharmila nomination: నామినేషన్ దాఖలు, మాటలకు సంకెళ్లా?

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న నామినేషన్లు వేసిన స్థానాల్లో.. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో TDP అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థిగా ఎన్డీయే కూటమి నుంచి నందమూరి బాలకృష్ణ నామినేషన్‌ వేశారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ YCP అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స సత్యనారాయణ. చీపురుపల్లిలో భారీ ర్యాలీ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు బొత్స. ఉండి నియోజకవర్గం నుంచి TDP లేదా జనసేన టికెట్ ఆశించిన రఘురామ కృష్ణరాజు మరో ట్విస్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు కనుమూరి భరత్‌ను బరిలోకి దించారు. ఉండి ఆర్వో కార్యాలయానికి కుమారుడు భరత్‌తో పాటు రఘురామ కృష్ణరాజు వెళ్లి నామినేషన్ వేయించారు. రఘురామ తరఫున ఆయన భార్య నామినేషన్ వేశారు.

Related News

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Big Stories

×