Siddharth Reaction on Engagement with Actress Aditi Rao Hydari: ఈ మధ్య హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా సీక్రెట్‌గా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. కానీ ఒక్కసారిగా గుడిలో పెళ్లి చేసుకున్నారంటూ రీసెంట్‌గా వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీంతో చాలామంది షాక్ అయ్యారు. తమ రిలేషన్‌పై ఎప్పుడూ స్పందించని ఈ జంట సడెన్‌గా మ్యారేజ్ చేసుకున్నారని తెలియడంతో ఆశ్చర్యపోయారు. అయితే రెండు రోజుల తర్వాత ఈ లవ్ కపుల్ ఈ వార్తలకు బ్రేక్ ఇచ్చారు. అది పెళ్లి కాదు.. రింగులు మార్చుకున్నామంటూ ఇద్దరూ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ తమ రిలేషన్, పెళ్లి గురించి మొదటి సారి స్పందించాడు. అతడు ఏం చెప్పాడో అనే విషయానికొస్తే..
‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. అప్పట్నుంచి డేటింగ్ చేస్తున్నారు. వెకేషన్ ట్రిప్స్, పలు ఈవెంట్లు, మ్యారేజ్ ఫంక్షన్లకు ఈ లవ్ కపుల్ కలిసి వెళ్లిన ఫొటోలు కూడా వైరల్ అవుతూ ఉండేవి. అయినా ఈ జంట తమ రిలేషన్ గురించి ఏనాడు బయటకు చెప్పుకోలేదు. ఇక ఇన్నాళ్లకు ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా వరంగల్‌లోని ఓ టెంపుల్‌లో తమిళ పురోహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
Also Read: ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈ సారి ఏంటో తెలుసా?
అయితే ఈ వేడుకకి కెమెరా మ్యాన్, మీడియాకు అనుమతి లేకపోవడంతో వీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు అని అంతా అనుకున్నారు. అయితే తర్వాత ఇన్‌స్టా వేదికగా ఇద్దరూ స్పందిస్తూ.. తాము మ్యారేజ్ చేసుకోలేదని.. రింగులు మాత్రమే మార్చుకున్నామని చెప్తూ ఫొటోలు పెట్టారు. దీంతో ఓహో రింగులు మార్చుకున్నారా? అని అప్పుడు చల్లబడ్డారు.
అలా మొదటిసారి తమ రిలేషన్ గురించి ఈ జంట ఓపెన్ అయ్యారు. అయితే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న సిద్ధార్థ్.. అదితితో నిశ్చితార్థం, పెళ్లిపై మొదటిసారి స్పందించాడు. ‘‘ మేము సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నామని చాలా మంది అంటున్నారు. నిజానికి సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా తేడా ఉంది. మాది పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్. మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వారు దీనిని సీక్రెట్ అని అనుకుంటున్నారు. అయితే వీటన్నింటిని నేను అస్సలు పట్టించుకోను. పెద్దల నిర్ణయం ప్రకారమే మా పెళ్లి జరుగుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: Mega Brothers: కొణిదెల బ్రదర్స్.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా
అంతేకాకుండా మరికొన్ని ప్రశ్నలకు కూడా సిద్ధార్థ్ ఆన్సర్స్ చెప్పాడు. ముందు ఎవరు ప్రపోజ్ చేశారని అడగ్గా.. తానే ముందు ప్రపోజ్ చేశానని అన్నాడు. అయితే ఆ తర్వాత అదితి ఎస్ చెబుతుందా? నో చెబుతుందా? అని చాలా టెన్షన్ పడ్డానని తెలిపాడు. కానీ ఫైనల్‌గా ఆమె ఎస్ చెప్పిందని.. ఆ టైంలో పరీక్షల్లో పాసైనంత హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.