BigTV English

Daksha Nagarkar: హాస్పిటల్‌లో చేరిన రవితేజ హీరోయిన్.. కోలుకోవడం చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

Daksha Nagarkar: హాస్పిటల్‌లో చేరిన రవితేజ హీరోయిన్.. కోలుకోవడం చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

Daksha Nagarkar latest news(Today tollywood news): ఈ మధ్య సినీ సెలబ్రెటీలు వరుసగా హాస్పిటల్ పాలవుతున్నారు. రకరకాల వ్యాధులతో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి మయోసైటీస్‌తో గత కొన్నేళ్లు చాలా స్ట్రగుల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేసింది. ఆమె మరెవరో కాదు.. యంగ్ హీరోయిన్ దక్ష దక్ష నాగర్కర్.


తెలుగులో హుషారు సినిమాలో హీరోయిన్‌గా అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది దక్ష నాగర్కర్. ఆ సినిమాలో తన అందం, యాక్టింగ్‌తో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసి అందరినీ అలరించింది. ఆపై ఈ హాట్ బ్యూటీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

అనంతరం గతేడాది స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమాలో నటించి అదరగొట్టేసింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం కరువయ్యాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


Also Read: ప్రతి అమ్మాయి చైతన్య లాంటి అబ్బాయిని కోరుకుంటుంది.. దక్ష నగార్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఎద అందాలు, నాభి అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఒక్కో ఫొటోకు ఒక్కో రకమైన ఫోజులిచ్చిన ఫొటోలను షేర్ చేసి ట్రెండింగ్‌ అవుతుంది. సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా హాస్పిటల్ పాలైంది. ఈ మేరకు ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.

ఆమె పోస్ట్ చేస్తూ.. తనకు సంబంధం లేని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా బాధగా ఉందని తెలిపింది. అప్పటికే తనకు రెండు సార్లు వెన్నెముకకు అనస్థీషియా ఇచ్చారని పేర్కొంది. అయితే దాని నుంచి కోలుకోవడానికి తనకు చాలా కష్టంగా ఉందని అందులో రాసుకొచ్చింది.

అంతేకాకుండా తను ఎంతో ఎమోషనల్ అవుతున్నానని.. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాని తెలిపింది. తనను ఇష్టపడేవాళ్లు, తన బాగు కోరేవాళ్లు ఉన్నంతవరకు తనకు ఏమీ కాదని తెలిపింది. అయితే ప్రస్తుతం బాగానే ఉన్నట్లు రాసుకొచ్చింది. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ బట్టి తనకు ఏదో సర్జరీ అయినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ వైరల్‌ కావడంతో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుతున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×