BigTV English

CMF BY Nothing Offers: ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు!

CMF BY Nothing Offers: ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు!

CMF BY Nothing Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా నథింగ్ సబ్-బ్రాండ్ తన ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్స్ ప్రకటించింది. నథింగ్ సబ్-బ్రాండ్ దాని CMF బడ్స్ ప్రో, CMF వాచ్ ప్రో, ఛార్జర్‌లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఇది కాకుండా కంపెనీ తన CMF బడ్స్‌ను మొదటిసారిగా రూ. 2 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తోంది. అన్ని బెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం.


CMF Buds Pro
CMF బడ్స్ ప్రోలో 45dB ANC, అల్ట్రా బాస్ టెక్నాలజీతో పాటు 10mm డైనమిక్ డ్రైవర్లు, మూడు HD మైక్‌లు ఉన్నాయి. ఇది క్లిస్టర్ క్లియర్ కాల్ అల్గారిథమ్‌కు సపోర్ట్ చేస్తాయి. బడ్స్ 10 నిమిషాల ఛార్జింగ్‌లో ANCతో 5 గంటలు బ్యాకప్ ఇస్తాయి. ANC లేకుండా 11 గంటల బ్యాకప్‌ను అందిస్తాయి. బడ్స్ ప్రో ధర రూ. 2,499గా ఉంది. డార్క్‌గ్రే, లైట్ గ్రే, ఆరెంజ్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Also Read : అదిరిపోతున్న ఐఫోన్ 16 ఫీచర్లు.. 15ను మించిపోయింది బాసూ!


CMF Buds
ఈ బడ్స్ 12.4 ఎంఎం బయో-ఫైబర్ డ్రైవ్, కస్టమ్ టిపియు డ్రైవర్స్‌తో వస్తాయి. ఈ బడ్స్ ధర రూ.2 వేల వరకు ఉంటుంది. ఇది 42dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 8 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉంది. ఇది కేసుతో 35.5 గంటల వరకు ఆపరేట్ చేయవచ్చు. 1,999కి కొనుగోలు చేయవచ్చు.

CMF Watch Pro
CMF వాచ్ ప్రో 1.96-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 600 nits బ్రైట్‌నెస్, 58fps రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది ఇంటర్నల్  GPS, బ్లూటూత్ 5.3, IP68 రేటింగ్‌తో వస్తుంది. CMF వాచ్ ప్రో డార్క్ గ్రే, మెటాలిక్ గ్రే, యాష్ గ్రే, సిల్వర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ.3,299.

CMF Neckband Pro
13.6mm డ్రైవర్లు,అల్ట్రా బాస్ టెక్ 2.0తో వస్తున్న నెక్‌బ్యాండ్ ప్రో మెరుగైన బాస్ కోసం సరైనవి. ఇది ఐదు అడ్జస్ట‌బుల్ బాస్ లెవల్‌ను, 50dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంది. దీనితో మీరు 37 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. నెక్‌బ్యాండ్ ప్రో ఆఫర్ ధర రూ. 1,799. ఆరెంజ్, లైట్ గ్రే వేరియంట్‌లో లభిస్తుంది.

Also Read : ధమాకా ఆఫర్స్.. టాప్ 5 కాస్ట్‌లీ 5G ఫోన్లు రూ.10 వేల కంటే తక్కువ ధరకే!

CMF 65W GaN charger
ఈ ఛార్జర్ డ్యూయల్ USB టైప్-C, టైప్-A పోర్ట్‌లను కలిగి ఉంది. దీన్ని ఒకేసారి రెండు గ్యాడ్జెట్లకు కనెక్ట్ చేయవచ్చు. ఐఫోన్ నుంచి సామ్‌సంగ్ ఫోన్లు, ఇయర్ ఫోన్ల వరకు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది డార్క్ గ్రే, ఆరెంజ్ కలర్స్‌లో వస్తుంది. దీని ధర రూ.2,699. ప్రత్యేక బండిల్ ఆఫర్‌గా నథింగ్ ఫోన్ (2) లేదా ఫోన్ (2A)ని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు CMF పవర్ 65W ఛార్జర్‌ను కేవలం రూ.1,999కి కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×