Big Stories

Mutual Funds KYC: మ్యూచువల్ ఫండ్.. కేవైసీ చేశారా?

Mutual Fund Investors Do you Need To Do KYC Again: కోరుకున్నట్టు భవిష్యత్తులో జీవించాలంటే.. పెట్టు బడులు ఎంతో మేలు చేస్తాయి. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి తోడ్పుతాయి. మరి ఇందులో మీ పెట్టుబడులకు చట్టబద్దతోపాటు, గుర్తింపు వివరాలు దృవీకరించడానికి కొత్తగా మదుపు చేయాలనుకునేవారు చేయాల్సిన వాటిలో కేవైసీ తప్పనిసరి ప్రక్రియ. వాటన్నంటికి ఇది కీలంకంగా మారుతుంది. పెట్టుబడుదారుల ప్రయోజనాలును మోసపూరిత కార్యకలాపాలను నిరోధించేందుకు ఇది సహాయపడుతుంది. మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేసే వ్యక్తి ఆ పెట్టుబడులకు అసలైన యజమాని అని నిర్ధారించేదే కేవైసీ.

- Advertisement -

పెట్టుబడులుకు కేవైసీ కచ్చితంగా చేయాల్సిన అవసరం ఏంటనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. కేవైసీ చేయడం వల్ల మనీలాండరింగ్ వంటి మోసాల ద్వారా నగదు ఫండ్ లోకి రాకుండా ఇది నిరోధిస్తుంది. దీంతో ఆర్ధిక మోసాలకు పాల్పడిన వారు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వ్యక్తిగత పెట్టుబడిదారులు సురక్షితంగా మ్యూచువల్ ఫండ్ లో పొదుపు చేసేందుకు అవసరమైన స్వేచ్ఛను కేవైసీ అందిస్తుంది.

- Advertisement -

Also Read: మారుతీ సంచలన నిర్ణయం.. అన్నీ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కేవైసీ తప్పనిసరి. పారదర్శకంగా మదుపరులు తమ పెట్టుబడులను నిర్వహించేందుకు వీలు కల్పించడమే దీని లక్ష్యం . మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు దగ్గర కేవైసీ వివరాలు ఎప్పటికప్పుడు తనఖీ చేసుకోవడం మంచిది.

ఇలా తెలుసుకోండి..

ఫండ్ సంస్థల వెబ్ సైట్ లలో మీ కేవైసీ స్టేటస్ తనిఖీ చేసుకోనచ్చు.

కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కూడా స్టేటస్ తెలుసుకునేందుకు వీలుంటుంది, పాన్, ఇతర వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు.

మీ కేవైసీని ధ్రువీకరించిన కేఆర్‌ఏని సంప్రదిస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. సమర్పించిన డాక్యుమెంట్లలో వ్యత్యాసాలు ఉంటే మీ కేవైసీని కొన్నిసార్లు తాత్కాలికంగా నిలిపివేసే ఆస్కారమూ ఉంది.

మీకోసం మీరు మదుపు చేస్తున్న సంస్థలో గాని కేఆర్‌ఏలను సంప్రదించి గాని, కేవైసీ నిలిపివేయడానికి గల కారణాలు తెలుసుకోవాలి. సమస్య డాక్యుమెంట్లలోనే ఉందని గుర్తిస్తే నిబంధనలకు అనుగుణంగా పత్రాలు తిరిగి సమర్పించండి. దీని తర్వాత ఫండ్ సంస్థలు, కేఆర్‌ఏలు కేవైసీని ఆమోదిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News