BigTV English

Actress Hema LIVE Video: తప్పు చేయకుండా ఉండడానికి నేను ఏమి దేవుడిని కాదు.. మరో వీడియో వదిలిన హేమ!

Actress Hema LIVE Video: తప్పు చేయకుండా ఉండడానికి నేను ఏమి దేవుడిని కాదు.. మరో వీడియో వదిలిన హేమ!

Actress Hema Released LIVE Video on Bangalore Rave Party: నటి హేమకు రోజురోజుకు పిచ్చి ఎక్కువ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు. ఆమె తన కెరీర్ లో సినిమాల వలన ఎంత పేరు తెచ్చుకుందో తెలియదు కానీ, ఈ బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యి.. ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. పోలీసులుతో సహా హేమ రేవ్ పార్టీలో ఉందని, ఆమె రక్త నమూనాలో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.


ఇంకోపక్క ఆమె పేరు మార్చుకొని ఈ పార్టీకోసం డబ్బులు కట్టినట్లు ఉన్న రసీదులు సైతం బయటపడ్డాయి. ఇంత జరిగినా కూడా హేమ మాత్రం అసలు నాకేం తెలియదు అని బుకాయిస్తునే వస్తుంది. ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఒక వీడియో రిలీజ్ చేసినప్పటినుంచి ఇప్పటివరకు కవర్ చేసుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నింటిని వాడేస్తుంది. మొదట నేను ఇంట్లోనే ఉన్నా.. బిర్యానీ చేస్తున్నా అని ఒక వీడియో పెట్టింది.. ఆ తరువాత ఆవకాయ పెడుతున్న అని ఇంకో వీడియో పుట్టుకొచ్చింది.

ఇక ఇప్పుడు లైవ్ పెట్టి.. నెటిజన్స్ పాజిటివ్ గా పెట్టిన కామెంట్స్ కు మాత్రం చదివి రిప్లైలు ఇచ్చింది. ఈరోజు విచారణకు డుమ్మా కొట్టి లైవ్ పెట్టి నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా ఇన్ డైరెక్ట్ గా కరాటే కళ్యాణికి కౌంటర్ ఇచ్చింది. ఈ ఘటన జరిగిన దగ్గరనుంచి కరాటే కళ్యాణి.. హేమ తప్పు చేసిందని, ఆమె అలాంటిదే అని నోరుపోయేలా అన్ని ఛానెల్స్ లో చెప్పుకొస్తుంది. ఇక దానికి హేమ లైవ్ లో ఆన్సర్ ఇచ్చింది.


Also Read: Namita Divorce: భర్తతో నమిత విడాకులు.. ఇదిగో క్లారిటీ.. ?

ఎలా ఉన్నారు మేడమ్ అని ఒక నెటిజన్ అడగ్గా.. ” నేను ఎప్పుడు బావుంటాను.. పాజిటివ్ గా ఆలోచించు.. మనసులో ఏం పెట్టుకోకు.. ఎవడైనా ఏమన్నా అంటే ఊరుకోకు.. ఎవతి ఏమన్నా కూడా ఊరుకోకు. మనం తప్పు చేయనంతవరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసిన మనమేమి దేవుళ్ళం కాదు. తప్పు చేసినా, పొరపాటు చేసినా మనస్ఫూర్తిగా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఒక అబద్దం చెప్తే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలి. అందుకే 99.99% అబద్దాలు ఆడకుండానే ఉండాలి. నేనెప్పుడూ అబద్దాలు ఆడాను.. అందుకే నేను హ్యాపీగా ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక లైవ్ లోనే చాలామంది పింక్ పింక్ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోలో హేమ వైట్ షర్ట్ లోపల పింక్ ఫ్లవర్స్ టాప్ వేసుకుంది. అందుకే ఆమెను అలా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక చాల్లే.. నువ్వెంత కవర్ చేసినా.. ఆ పార్టీలో నువ్వు ఉన్నవని కన్ఫర్మ్ అయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Fahadh Faasil: చికిత్సే లేని వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×