BigTV English

Johnny Wactor Shot Dead: నటుడు జానీవాక్టర్‌ను చంపిన దుండగులు.. ఎలా జరిగింది?

Johnny Wactor Shot Dead: నటుడు జానీవాక్టర్‌ను చంపిన దుండగులు.. ఎలా జరిగింది?

Actor Johnny Wactor Shot Dead: అమెరికాలో గన్ కల్చర్ తారాస్థాయికి చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు చాలామంది అక్కడి దోపిడీ గ్యాంగుల చేతుల్లోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎదురించిన వాళ్లను తమ వద్దనున్న గన్‌లతో కాల్చి చంపుతున్నారు. దీని బారినపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు కూడా.


తాజాగా 37ఏళ్ల హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్‌ను దుండగులు కాల్చి చంపారు. లాస్‌ఏంజిల్స్ సమీపంలో  కారులో వెళ్తుండగా జానీ వాక్టర్‌పై దోపిడీకి ప్లాన్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. నటుడు ప్రతిఘటించడం తో కాల్పలకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటన తెల్లవారుజామున మూడుగంటల సమయంలో జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆయన కారును చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోని సీసీకెమెరాల పుటేజ్‌ను పరిశీలించారు. కాకపోతే దుండగులు ముఖానికి క్లాత్ కట్టుకోవడంతో పోలికలు లభించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


Also Read: ఇజ్రాయెల్ దాడులు, షెల్టర్‌లో 35 మంది..

ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు జానీ వాక్టర్‌. 2007లో ఆర్మీవైవ్స్ అనే టీవీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. వెరైటీగా టీవీ షోలు చూస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జానీవాల్టర్ మరణవార్త తెలియగానే ఇండస్ట్రీకి చెందిన పలువురు షాకయ్యారు. ఆయన మృతికి సంతాపం చెబుతూనే, జానీతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Tags

Related News

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Big Stories

×