BigTV English

Fahadh Faasil with ADHD: చికిత్సే లేని వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్..

Fahadh Faasil with ADHD: చికిత్సే లేని వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్..

Malayalam Actor Fahadh Faasil Suffers with ADHD: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు. తాను ADHD అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్ తో బాధపడుతున్నానని, 41 ఏళ్ళ వయస్సులో ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు. ఈ వ్యాధి వలన ఎంతో ఒత్తిడికి గురవుతామని, ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదట.. హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ లాంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయని ఆయన తెలిపాడు. అంటే ఇదొక మెంటల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు.


అంతేకాకుండా చిన్నతనంలో ఈ వ్యాధిని గుర్తిస్తే ఏమైనా ప్రయోజనం ఉండేది అని, కానీ ఈ వయసులో బయటపడేసరికి వైద్యులు సైతం ఏమి చేయలేకపోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఫహాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు.. పుష్ప సినిమాతో ఫహాద్ తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు.

పార్టీ లేదా పుష్ప అనే ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు.పుష్ప 2 లో కూడా ఫహాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మధ్యనే ఆవేశం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఫహాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు సినిమా ఒకటి. ఆ సినిమాకు నిర్మాత ఫహాద్ నే.


Also Read: Pushpa 2 Second Song: పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ వచ్చేసింది.. ఇవేం స్టెప్పులు మావా

ఇక సినిమాలతో పాటు సామజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఫహాద్ ముందు ఉంటాడు. సోమవారం కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫహాద్.. తన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహాద్ డిసార్డర్ న్యూస్ నెట్టింటి వైరల్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×